మరో యూటర్న్: బాబుపై విజయసాయి సెటైర్లు

Published : Jun 16, 2019, 05:31 PM IST
మరో యూటర్న్: బాబుపై విజయసాయి సెటైర్లు

సారాంశం

టీడీపీ చీఫ్ చంద్రబాబుపై వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు కురిపించారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.  


అమరావతి: టీడీపీ చీఫ్ చంద్రబాబుపై వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు కురిపించారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.

 

ఎన్నికల షాక్ నుండి తేరుకోకముందే  చంద్రబాబునాయుడు యూ టర్న్ తీసుకొన్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇకపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని యూపీఏలో చంద్రబాబు కొనసాగరట... కేంద్రంపై పోరాటాలకు విరామం ఇస్తారట... అమిత్‌షాకు మోకరిల్లే ప్రయత్నమని ఇవన్నీ చూస్తే అర్ధమౌతోందని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.

కేంద్రంపై పోరాటాలకు విరామం పట్టించుకొనేవారుండరు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల కాలంలో  విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా టీడీపీ నేతలపై తీవ్రమైన విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.
 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : తెలంగాణపై చలి పంజా.. ఈ జిల్లాల్లో వచ్చే పదిరోజులు అత్యల్ప ఉష్ణోగ్రతలు
Scrub Typhus : తెలుగు రాష్ట్రాల్లో కొత్త వ్యాధి.. ఏమిటిది, ఎలా సోకుతుంది, లక్షణాలేంటి?