ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి కోన రఘుపతి నామినేషన్ దాఖలు

Published : Jun 17, 2019, 04:13 PM IST
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి కోన రఘుపతి నామినేషన్  దాఖలు

సారాంశం

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి నామినేషన్ దాఖలు చేశారు. రఘువతి నామినేషన్‌ను బలపరుస్తూ పది మంది ఎమ్మెల్యేలు బలపర్చారు.  

అమరావతి: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి నామినేషన్ దాఖలు చేశారు. రఘువతి నామినేషన్‌ను బలపరుస్తూ పది మంది ఎమ్మెల్యేలు బలపర్చారు.
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. రేపు డిప్యూటీ స్పీకర్ ఎన్నికలు జరగనున్నాయి.

ఇవాళ సాయంత్రం ఐదు గంటల వరకు  నామినేషన్ల దాఖలుకు గడువు ఉంది. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి బ్రహ్మణ సామాజిక వర్గానికి కేటాయించాలని  నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు కోన రఘుపతి ఈ పదవికి నామినేషన్  దాఖలు చేశారు.

రఘుపతి నామినేషన్ ను బలపరుస్తూ పది మంది వైసీపీ ఎమ్మెల్యేలు కూడ నామినేషన్లు దాఖలు చేశారు. మంగళవారం నాడు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్  పదవికి ఎన్నికలు జరగనున్నాయి.

PREV
click me!

Recommended Stories

ఉదయగిరిలో చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ | Palle Panduga 3.0 | Pawan Kalyan | Asianet News Telugu
పల్లె పండుగ 3.0లో BJP చీఫ్ PVN మాధవ్ స్పీచ్ | Chandrababu | Pawan Kalyan | Asianet News Telugu