తండ్రి బాటలోనే జగన్, అనుయాయులకు పెద్దపీట: జక్కంపూడి రాజాకి కీలక పదవి

By Nagaraju penumalaFirst Published Jul 19, 2019, 6:14 PM IST
Highlights

ప్రత్యేక హోదా సాధన కోసం వైయస్ జగన్ అత్యంత ప్రాధాన్యంగా నిర్మించిన యువభేరి వంటి కార్యక్రమంలో కీలక పాత్ర పోషించారు జక్కంపూడి రాజా. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోసిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జక్కంపూడి రాజా రాజానగరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి పెందుర్తి వెంకటేష్ పై ఘన విజయం సాధించారు.  

అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు కీలక పదవి వరించింది. కాపు కార్పొరేషన్ చైర్మన్ గా జక్కంపూడి రాజా నియామకంపై ఏపీ మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు. 

ఈ నేపథ్యంలో ఇటీవలే ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కాపులకు రూ.2వేల కోట్లు కేటాయిస్తూ కీలక నిర్ణయం ప్రకటించింది. ఇకపోతే జక్కంపూడి రాజా దివంగత మాజీమంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు తనయుడు. జక్కంపూడి రామ్మోహన్ రావు దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. 

తూర్పుగోదావరి జిల్లాలో వైయస్ కు నమ్మిన వ్యక్తిగా జక్కంపూడి రామ్మోహన్ రావు వ్యవహరించారు. జక్కంపూడి మరణానంతరం ఆయన కుటుంబం వైయస్ జగన్ వెంట నడిచారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడుగా పనిచేస్తున్నారు. 

click me!