కాంగ్రెస్‌లోకి షర్మిల.. వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసు, సైడ్ ట్రాక్ రాజకీయాలు : సజ్జల హాట్ కామెంట్స్

By Siva KodatiFirst Published Jan 6, 2024, 6:06 PM IST
Highlights

ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై స్పందించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. షర్మిల కాంగ్రెస్‌లో చేరడం వెనుక చంద్రబాబు కుట్ర వుందని సజ్జల ఆరోపించారు. షర్మిల ఏపీ నుంచి అండమాన్ వరకు ఎక్కడైనా పనిచేయొచ్చని.. జగన్‌పై దుమ్మెత్తి పోసేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై స్పందించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. షర్మిల కాంగ్రెస్‌లో చేరడం వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. బ్రదర్ అనిల్ కుమార్‌ను గతంలో టీడీపీ నేతలు ఎలాంటి ఆరోపణలు చేశారో చూశామని, ఇప్పుడుమే పక్కన నిలబడి ఫోటోలు దిగుతున్నారని సజ్జల దుయ్యబట్టారు.

వైఎస్సార్ మరణంలోనూ కాంగ్రెస్ పార్టీపై అనుమానాలు వున్నాయని,  వైసీపీ పెట్టిన తొలిరోజుల్లోనే కాంగ్రెస్ వివేకాను బరిలోకి తెచ్చిందని రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌తో చంద్రబాబు తెరవెనుక రాజకీయం కొనసాగుతోందని, దానిని డైవర్ట్ చేయడానికే ఆయన ఇలాంటి కుట్రలకు దిగుతున్నారని సజ్జల ఆరోపించారు. 

కాంగ్రెస్ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని.. ఏపీలో జరిగిన గత రెండు ఎన్నికల్లోనూ వారికి ఒక్క సీటు కూడా రాలేదని ఆయన గుర్తుచేశారు. కాంగ్రెస్ గురించి రాష్ట్రంలో ఎవరూ సీరియస్‌గా లేరని సజ్జల వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ సహా అందరినీ మేనేజ్ చేస్తూ చంద్రబాబు అధికారం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. షర్మిల వల్ల వైసీపీకి వచ్చిన ప్రమాదం ఏం లేదని ధీమా వ్యక్తం చేశారు.

ఏపీలో వైసీపీకి భవిష్యత్ లేదని.. షర్మిల కాంగ్రెస్‌లో చేరడం వెనుక చంద్రబాబు కుట్ర వుందని సజ్జల ఆరోపించారు. షర్మిల ఏపీ నుంచి అండమాన్ వరకు ఎక్కడైనా పనిచేయొచ్చని.. జగన్‌పై దుమ్మెత్తి పోసేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. అభివృద్ధి లేకుండా, సైడ్ ట్రాక్ రాజకీయాలతో అధికారంలోకి రావాలని చూడటమే చంద్రబాబు ప్లాన్ అని రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. 
 

click me!