గ్రేటర్ విశాఖ మేయర్ గా హరి వెంకటకుమారి: విజయసాయి రెడ్డి ప్రకటన

Published : Mar 18, 2021, 10:20 AM ISTUpdated : Mar 18, 2021, 10:33 AM IST
గ్రేటర్ విశాఖ మేయర్ గా హరి వెంకటకుమారి: విజయసాయి రెడ్డి ప్రకటన

సారాంశం

జీవీఎంసీ మేయర్ పదవి హరి వెంకటకుమారికే దక్కింది. జీవీఎంసీ కార్పోరేటర్ల సమావేశంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు.  

విశాఖపట్టణం: జీవీఎంసీ మేయర్ పదవి హరి వెంకటకుమారికే దక్కింది. జీవీఎంసీ కార్పోరేటర్ల సమావేశంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు.

కార్పోరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిసి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెంట్రల్ పార్క్ హోటల్ లో గురువారం నాడు సమావేశమయ్యారు.  ఈ సమావేశంలో మేయర్ అభ్యర్ధి పేరును విజయసాయిరెడ్డి ప్రకటించారు. . ఈ సమావేశం తర్వాత వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించారు.

అక్కడి నుండి నేరుగా  జీవీఎంసీ కార్యాలయానికి చేరుకోనున్నారు. జీవీఎంసీ కార్పోరేషన్ మేయర్ పదవిని దక్కించుకోవాలని వైసీపీ చేసిన ప్లాన్ సక్సెస్ అయింది. గతంలో ఈ కార్పోరేషన్  టీడీపీ చేతిలో ఉండేది. ఈ ఎన్నికల సమయంలో  అధికారానికి దూరంగా టీడీపీ నిలిచిపోయింది.  

జీవీఎంసీ  కార్పోరేటర్లుగా విజయం సాధించిన వారితో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత జీవీఎంసీ మేయర్ , డిప్యూటీ మేయర్ ఎన్నికను నిర్వహిస్తారు. 

విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా వైసీపీ సర్కార్ ప్రకటించింది. మూడు రాజధానుల హామీలో భాగంగానే విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా వైసీపీ ప్రకటించింది. మూడు రాజధానుల తమ ప్రకటనకు ప్రజలు మద్దతు ప్రకటించారని ఈ ఎన్నికల ఫలితాలు తేల్చాయని వైసీపీ ప్రకటించింది.మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది.


 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే