Kuppam Election: బాబాయ్‌ని గొడ్డ‌లి పోటులాగే... ప్రజాస్వామ్యంపై దొంగఓట్ల వేటు: లోకేష్ ఆగ్రహం

By Arun Kumar PFirst Published Nov 15, 2021, 11:20 AM IST
Highlights

కుప్పం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని... భారీగా దొంగ ఓట్లు వేయిస్తోందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. 

చిత్తూరు: కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైసిపి అక్రమాలకు పాల్పడుతోందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. ప్రస్తుతం కుప్పంలో పోలింగ్ జరుగుతుండగా అధికార వైసిపి భారీగా దొంగఓట్లు వేయిస్తోందని లోకేష్ అన్నారు. ప్రజాస్వామ్య పద్దతిలో పోలింగ్ జరిగితే వైసిపి ఓటమి తప్పదు కాబట్టే అక్రమాలకు తెరతీసారని nara lokesh పేర్కొన్నారు.

''బాబాయ్‌ని గొడ్డ‌లి పోటుతో బ‌లిచేసిన‌ట్టే..ప్ర‌జాస్వామ్యాన్ని దొంగ ఓట్ల వేటుతో ఖూనీ చేస్తున్నారు జ‌గ‌న్‌రెడ్డి. కుప్పంలో దొంగ ఓట్లు, మాఫియా డ‌బ్బుతో అత్యంత ప‌విత్ర‌మైన ఎన్నిక‌ల వ్య‌వ‌స్థ‌ని jagan reddy న‌డిబ‌జారులో అంగ‌డి స‌రుకు చేశారు. టిడిపి నేత‌ల్ని నిర్బంధించి, ఏజెంట్ల‌ని అరెస్టుచేసిన పోలీసులు...ఇత‌ర‌ప్రాంతాల నుంచి దొంగ ఓట్లు వేసేందుకు వైసీపీ తీసుకొచ్చినవారిని మాత్రం కుప్పంలోకి ఎలా రానిచ్చారు? YSRCP వాలంటీర్లే దొంగ ఓట‌ర్ల‌ని బూత్‌ల‌కు తీసుకొస్తుంటే ఎన్నిక‌ల సంఘం ఏం చేస్తోంది? పోలీసుల ముందే దొంగ ఓట‌ర్లు కాలరెగ‌రేసుకుని వెళ్తూ ఓటేసి వ‌స్తున్నారు'' అని లోకేష్  పేర్కొన్నారు. 

''జ‌గ‌న్ అరాచ‌క‌ పాల‌న‌, పెరిగిన ధ‌ర‌లు, పెంచిన ప‌న్నులు, అధ్వాన రోడ్లు, కానరాని అభివృద్ధితో తీవ్ర ఆగ్ర‌హంగా వున్న ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా వ‌చ్చి ఓట్లు వేస్తే దారుణ ఓట‌మి త‌ప్ప‌ద‌ని తెలుసుకున్న జ‌గ‌న్‌రెడ్డి... డెమోక్ర‌సీ ప‌ద్ధ‌తిలో జ‌ర‌గాల్సిన ఎల‌క్ష‌న్‌ని ఫ్యాక్షనిస్టు క‌నుస‌న్న‌ల్లో జ‌రిగే సెల‌క్ష‌న్ గా మార్చేశారు'' అని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

read more  కుప్పం : టీడీపీ నేతల అరెస్ట్‌కు యత్నం... ఉద్రిక్తత, పోలీసులతో అమర్‌నాథ్ రెడ్డి వాగ్వాదం

ఇక ఇప్పటికే kuppam municipala election పోలింగ్ లో అధికార  వైసిపి అక్రమాలకు పాల్పడుతుందని... వాటిని అడ్డుకోడానికి సిద్దంగా వుండాలని  TDP శ్రేణులకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు సూచించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసిపి దొంగ ఓట్లు వేయించడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. ఇలాంటి అక్రమాలకు సంబంధించిన ఆధారాలను సేకరించాలని... వైసిపి అక్రమాలకు సంబంధించి వీడియోలు తీసి బయటపెట్టాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. పోలింగ్ సరళిని స్వయంగా పర్యవేక్షించేందుకు చంద్రబాబు కుప్పం వెళ్లనున్నారు.  

సోమవారం ఉదయం నుండి కుప్పం మున్సిపాలిటీలో 24వార్డులకు పోలింగ్ జరుగుతోంది. ఈ మున్సిపాలిటీలో దాదాపు 39వేల మంది ఓటర్లుండగా వారికోసం 48పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేసారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇలాకా అయిన కుప్పంలో గెలిచి మరోసారి సత్తా చాటాలని అధికార వైసిపి భావిస్తోంది. ఈక్రమంలోనే పట్టు నిలుపుకోవాలని టిడిపి భావిస్తోంది. ఇలా ఇరుపార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎన్నికల ప్రకటన మొదలు ఇప్పటి పోలింగ్ వరకు కుప్పంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనివుంది.  

read more  AP Municipal Elections: ఏపీలో కొనసాగుతున్న స్థానిక సంస్థల పోలింగ్.. కుప్పం వెళ్లనున్న చంద్రబాబు

పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేసారు.దాదాపు 500మంది పోలీసులు కుప్పం ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. ఇక చిత్తూరు జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు కుప్పంలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. 

సోమవారం ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ ఇప్పటికయితే ప్రశాంతంగా కొనసాగుతోంది. సాయంత్రం 5గంటల వనకు పోలింగ్ కొనసాగనుంది. కుప్పం ఓటర్లు ఓటు వేయడానికి ఆసక్తిచూపిస్తూ పోలింగ్ కేంద్రాలను తరలుతున్నారు. దీంతో పోలింగ్ శాతం భారీగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

click me!