కనక దుర్గమ్మను దర్శించుకున్న వైఎస్ జగన్

By Siva KodatiFirst Published May 29, 2019, 5:29 PM IST
Highlights

వైసీపీ చీఫ్, కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఇంద్రకీలాద్రికి చేరుకున్న జగన్‌కు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు

వైసీపీ చీఫ్, కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఇంద్రకీలాద్రికి చేరుకున్న జగన్‌కు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు.

అమ్మవారి దర్శనం చేయించి తీర్ధప్రసాదాలు అందజేశారు. బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. అనంతరం కడపలోని పెద్ద దర్గా, పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు.

అక్కడి నుంచి ఇడుపులపాయలోని వైఎస్ సమాధిని సందర్శించిన ఆయన నివాళులర్పించారు. లంచ్ బ్రేక్‌కు కూడా ఆగని జగన్ కడప నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. 

click me!