హాట్ టాపిక్ : సీఎం జగన్ రాజకీయ వారసుడు ఎవరంటే.....

By Nagaraju penumalaFirst Published Jul 10, 2019, 2:57 PM IST
Highlights

ఆకస్మాత్తుగా వైయస్ జయంతి ఉత్సవాల్లో రాజారెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో వైయస్ జగన్ వారసుడు రాజారెడ్డి అంటూ ప్రచారం జరుగుతోంది. సీఎం వైయస్ జగన్ కు కుమారులు లేరు. ఇద్దరు కుమార్తెలే. దాంతో వైయస్ షర్మిల తనయుడు రాజారెడ్డియే వైయస్ జగన్ వారసుడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 
 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వ్యక్తి రాజారెడ్డి. రాజారెడ్డి అంటే దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి అనుకుంటే పొరపాటే. రాజారెడ్డి మునిమనవడు, వైయస్ షర్మిల అనిల్ దంపతుల వారసుడు రాజారెడ్డి. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి స్వయానా మేనల్లుడు. దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి ఉత్సవాల్లో రాజారెడ్డి హల్ చల్ చేశారు. వైయస్ఆర్ జయంతి ఉత్సవాల్లో రాజారెడ్డి హల్ చల్ చేశారు. 

ఆరున్నర అడుగుల ఎత్తుతో మంచి ఫిట్నెస్ తో బాలీవుడ్ హీరోని తలపించేలా కనిపించడంతో అంతా ఆయనపైనే దృష్టి సారించారు. వైయస్ షర్మిల, అనిల్ దంపతులను మించి మంచి హైట్ రాజారెడ్డి. 

వైయస్ జయంతి ఉత్సవాల్లో మేనమామ సీఎం వైయస్ జగన్ తో ముచ్చటించారు. సీఎం జగన్ తో కలిసి సందడి చేశాడు. ఇకపోతే అమ్మమ్మ వైయస్ విజయమ్మ వెన్నంటి ఉండేవాడు రాజారెడ్డి. 

రాజారెడ్డి అంటే వైయస్ కుటుంబంలో ప్రత్యేక ఆకర్షణ. వైయస్ వంశవృక్షం అయిన రాజారెడ్డిని గుర్తుకు తెచ్చేలా షర్మిల తనయుడుకు ఆ పేరు పెట్టారు దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి. తన తాతయ్య రాజారెడ్డి అంటే సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఇష్టం. 

సీఎం వైయస్ జగన్ తన తాత వైయస్ రాజారెడ్డి పోలిక అంటూ ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. ఆయనకు ఉన్న రాజకీయ చతురత, కోపం అన్ని జగన్ లో ఉన్నాయని ఆయన సన్నిహితులు చెప్పేవారు. వైయస్ జగన్ కు గానీ షర్మిలకు గానీ రాజారెడ్డి అంటే చాలా ఇష్టమట. 

తన తాతయ్యపేరు వైయస్ షర్మిల తనయుడుకు పెట్టడంతో వైయస్ జగన్ మేనల్లుడుపై ప్రత్యేక ప్రేమ చూపించేవారట. ఇంటి సభ్యులంతా కలిసినప్పుడు వైయస్ జగన్ రాజారెడ్డితోనే ఎక్కువ సమయం గడుపుతుండేవారని చెప్తుంటారు. 

ఆకస్మాత్తుగా వైయస్ జయంతి ఉత్సవాల్లో రాజారెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో వైయస్ జగన్ వారసుడు రాజారెడ్డి అంటూ ప్రచారం జరుగుతోంది. సీఎం వైయస్ జగన్ కు కుమారులు లేరు. ఇద్దరు కుమార్తెలే. దాంతో వైయస్ షర్మిల తనయుడు రాజారెడ్డియే వైయస్ జగన్ వారసుడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 

రాజారెడ్డికి రాజకీయాలంటే ఇష్టమని ప్రచారం ఉంది. వైయస్ షర్మిల ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేస్తున్నప్పుడు తల్లి అడుగులో అడుగులు వేశాడు. చాలా సార్లు ఆమెతో కలిసి పాదయాత్ర చేశారు. ఆ తర్వాత పలు సందర్భాల్లో రాజకీయ వేదికలపై కూడా హల్ చల్ చేశారు. 

అయితే గతంలో వైయస్ జగన్ పై కేసులు, ఆనాడు నెలకొన్న రాజకీయ సమస్యల నేపథ్యంలో వాటి ప్రభావం రాజారెడ్డిపై పడకుండా ఉండాలని కుటుంబ సభ్యులు అతనిని బెంగళూరుకు పంపించి వేశారు. రాజారెడ్డి బెంగళూరులోనే ఉండి చదువుకున్నారు. ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్నాడు రాజారెడ్డి. 
 
మరోవైపు రాజారెడ్డిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారని ప్రచారం కూడా ఉంది. రాజారెడ్డి తన తండ్రి బ్రదర్ అనిల్ మాదిరిగా మత ప్రబోధకుడిగా మారుతాడని తెలుస్తోంది. 

ఆ నేపథ్యంలోనే విదేశాల్లో ట్రైనింగ్ తీసుకుంటున్నారని ప్రచారం. మెుత్తానికి రాజారెడ్డి టాపిక్ మాత్రం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారడం విశేషం. రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తారా లేక తండ్రి అడుగుజాడల్లో నడుస్తారా అన్నది కాలమే నిర్ణయించాలి. 

click me!