తండ్రి బాటలోనే తనయుడు: జూలై 1 నుంచి జగన్ ప్రజా దర్బార్

By narsimha lodeFirst Published Jun 29, 2019, 1:25 PM IST
Highlights

 తండ్రి తరహాలోనే ఏపీ సీఎం వైఎస్ జగన్  ప్రజలను నేరుగా కలుసుకొనేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నారు. ప్రతి రోజూ   ప్రజా దర్బార్‌ పేరుతో ప్రజలను కలుసుకోనున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రతి రోజూ గంట పాటు ప్రజలను కలుసుకొంటారు.


అమరావతి: తండ్రి తరహాలోనే ఏపీ సీఎం వైఎస్ జగన్  ప్రజలను నేరుగా కలుసుకొనేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నారు. ప్రతి రోజూ   ప్రజా దర్బార్‌ పేరుతో ప్రజలను కలుసుకోనున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రతి రోజూ గంట పాటు ప్రజలను కలుసుకొంటారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్ర సీఎంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో  తమ సమస్యలను  సీఎంకు చెప్పుకొనేందుకు సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చేవారు. ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కరించాలని  వైఎస్ఆర్ ఆదేశాలు జారీ చేసేవారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత  సీఎం వైఎస్ జగన్ జూలై 1వ తేదీన ప్రజా దర్బార్ ను నిర్వహించనున్నారు. ప్రజా దర్బార్ నిర్వహణ కోసం  అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

ప్రజాదర్భార్ లో  ఎక్కువగా ప్రజలు తమ వ్యక్తిగత సమస్యలను పరిష్కరించాలని కోరుతారని గత రికార్డులు చెబుతున్నాయి.జగన్ సీఎంగా బాధ్యతలు తీసుకొన్న తర్వాత ప్రజల నుండి వచ్చిన వినతులను  ఇప్పటికే తీసుకొన్నారు.  తమ సమస్యలను ప్రజలు సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నారు. 

ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద ప్రజా దర్బార్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. క్యాంపు కార్యాలయం వద్ద ఓ వైపు షెడ్‌ను ఏర్పాటు చేశారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు వేచి ఉండేందుకు అనువైన ఏర్పాట్లు చేస్తున్నారు. 

ప్రజలకు అవసరమైన మంచినీటి సదుపాయం, ఫ్యాన్లు  ఏర్పాటు చేస్తున్నారు.  ప్రజలను సీఎం జగన్ కలుసుకొనే సమయంలో  భద్రతా పరమైన ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు వీలుగా పోలీసు సిబ్బంది జాగ్రత్తలు తీసుకొంటున్నారు. 
 

click me!