144 ఆక్సిజన్ ప్లాంట్లను జాతికి అంకితం చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్...

By SumaBala Bukka  |  First Published Jan 10, 2022, 12:55 PM IST

ప్రతి యాభై పడకల ప్రభుత్వాసుపత్రుల్లో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేశామని.. ఇదివరకటిలా కాకుండా ఇప్పుడు మనమే సొంతంగా ఆక్సిజన్‌ను జనరేట్‌చేసే పరిస్థితిలోకి వచ్చామని తెలిపారు. మరో 71 చోట్ల ప్రైయివేటు ఆస్పత్రుల్లో కూడా 71 ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయించామన్నారు.


అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి YS Jagan Mohan Reddy తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వవర్చువల్ గా రాష్ట్రంలోని 144 oxygen plantsను ప్రారంభించారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ...రాష్ట్రవ్యాప్తంగా 144 పీఎస్‌ఏ ప్లాంట్లకు ప్రారంభోత్సవం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో 32 ప్లాంట్లను ప్రాంరభించాం.వీటికి అదనంగా ఈ 144 ప్లాంట్లను నెలకొల్పాం. వీటిని జాతికి అంకితం చేస్తున్నాం... అన్నారు.

ప్రతి యాభై పడకల ప్రభుత్వాసుపత్రుల్లో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేశామని.. ఇదివరకటిలా కాకుండా ఇప్పుడు మనమే సొంతంగా ఆక్సిజన్‌ను జనరేట్‌చేసే పరిస్థితిలోకి వచ్చామని తెలిపారు. మరో 71 చోట్ల ప్రైయివేటు ఆస్పత్రుల్లో కూడా 71 ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయించామన్నారు.

Latest Videos

30శాతం సబ్సిడీ...
ఆక్సీజన్ ప్లాంట్ల కోసం 30శాతం Subsidyనికి కూడా ఇచ్చామన్నారు. ఇవి కూడా పూర్తైతే అక్షరాల 247 చోట్ల సొంతంగా ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్లు ఉన్నట్టు అవుతుందన్నారు. కోవిడ్‌ సమయంలో ఇది చాలా గొప్ప కార్యక్రమం అని చెప్పుకొచ్చారు. 

ఇంకా మాట్లాడుతూ..దేశంలోనూ, రాష్ట్రంలోనూ Oxygen deficiency వల్ల ఎలా ఇబ్బంది పడ్డామో మనం చూశామన్నారు.  వైరస్‌ ప్రభావం శ్వాసమీద, ఊపిరి తిత్తులమీద ప్రభావం చూపించిందని.. సెకండ్‌వేవ్‌లో నేర్చుకున్న పాఠాలనుంచి తీసుకున్న చర్యల కారణంగా ఈ మెరుగైన పరిస్థితిలోకి వచ్చామన్నారు.

ఆక్సిజన్‌ ట్యాంకర్లను విమానాల్లో తరలించాల్సిన పరిస్థితి ఆరోజు వచ్చిందని..
విదేశాలనుంచి కూడా ఆక్సిజన్‌ను తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని,  షిప్పుల్లో కూడా తరలించాల్సి వచ్చిందన్నారు. అలాంటి దారుణమైన పరిస్థితుల నుంచి  రాష్ట్రాన్ని సన్నద్ధంగా ఉంచేందుకు ప్రతి ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్‌ కొరత రాకుండా తగిన చర్యలను తీసుకున్నామని చెప్పుకొచ్చారు. 

రూ.426 కోట్లు ఖర్చు చేసి.. మెడికల్‌ ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్లను సిద్ధంచేసుకున్నామన్నారు. 144 ప్లాంట్లను సొంతంగానే రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేసుకుందని, కోవిడ్‌వచ్చిన 2 ఏళ్లకాలంలో.. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతున్నప్పటికీ ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తూ, నాడు – నేడు ద్వారా ఆస్పత్రులను, స్కూళ్లను బాగు చేసుకుంటున్నామన్నారు.

దీంతోపాటు ఆర్బీకేలతో వ్యవసాయంలోనూ విప్లవాత్మక చర్యలు చేపట్టామన్నారు. పీఎస్‌ఏ ప్లాంట్ల ఏర్పాటుతోపాటు సివిల్, ఎలక్ట్రికల్‌ పనులు చేశామన్నారు. లిక్విడ్‌మెడికల్‌ ఆక్సిజన్‌ రవాణా, నిల్వకోసం 20 కిలోలీటర్ల సామర్థ్యం ఉన్న 25 క్రయోజనిక్‌ ట్యాంకర్లను కూడా కొనుగోలు చేశామని చెప్పారు.

అన్నీ అందుబాటులో...
ప్రస్తుతం అన్నీ అందుబాటులో ఉన్నాయని.. 24,419 బెడ్లకు నేరుగా ఆక్సిజన్‌పైపులైన్లు కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. దీనికోసం 100 కోట్లు ఖర్చు చేశామన్నారు. మొత్తంగా 74 ఎల్‌ఎంఓ ట్యాంకులు కొనుగోలు చేసి వాటిని అందుబాటులో పెట్టామన్నారు.

ఎలాంటి వేవ్‌వచ్చినా సన్నద్ధంగా ఉండేందుకు వీలుగా ఈ పనులు చేపట్టాం. కమ్యూనిటీ సెంటర్లలో కూడా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశాం.
చిన్నపిల్లలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు 20 పడకల పీడియాట్రిక్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు  చేశాం. చిన్నపిల్లలకు ఇంకా అవసరం వచ్చే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మరికొన్ని లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్లను ఏర్పాటు చేస్తున్నాం అన్నారు.

గతంలో ఒక్క వీఆర్‌డీఎల్‌ల్యాబ్‌ కూడా మనకు ఉండేది కాదని.. టెస్టులకోసం హైదరాబాద్, పుణేలకు పంపించాల్సిన పరిస్థితి  ఉండేది. అలాంటిది ప్రస్తుతం 20 వైరల్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేశాం. దీనికి అదనంగా మరో 19 ల్యాబ్‌లు ఏర్పాటు చేశాం. రోజుకు లక్షమందికి లెస్టులు చేసే పరిస్థితి ఉంది. ఒమిక్రాన్‌ నిర్ధారణకు జినోమ్‌ సీక్వెన్స్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేశాం అన్నారు.

దేశంలో కేరళ తర్వాత విజయవాడలోనే ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేశామని, రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడ్డ వారికి 100శాతం వ్యాక్సినేషన్‌ చేశామని..  ఇందులో రెండుడోసులు కూడా దాదాపు 80శాతం మందికి ఇచ్చామని చెప్పుకొచ్చారు. 

15–18 ఏళ్లు ఉన్నవారికి కూడా వ్యాక్సినేషన్‌
15–18 ఏళ్లు ఉన్నవారికి కూడా వ్యాక్సినేషన్‌ చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ చెప్పుకొచ్చారు. 24.4 లక్షల మందికి వ్యాక్సిన్‌ చేయాల్సిన పరిస్థితి ఉంటే 20.02 లక్షల మందికి అంటే దాదాపు 82శాతం మందికి  వ్యాక్సినేషన్‌చేశామని.. దేశంలోనే అగ్రగామిగా ఉన్నామన్నారు. 

విభజన వల్ల హైదరాబాద్‌ను కోల్పోవడంతో అత్యున్నత వైద్యం ఉన్న సంస్థలు లేకుండా పోయాయి. దేవుడి దయతో బ్రహ్మాండమైన వ్యవస్థ రాష్ట్రంలో ఉంది. వాలంటీర్లు, గ్రామ, వార్డు, సచివాలయ వ్యవస్థ ఉందని, ఇంటింటికీ సర్వేలే దాదాపు33 సార్లు జరిగాయని..ఎవరికి లక్షణాలు ఉన్నా.. వారికి పరీక్షలు చేసి వైద్యం అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. 

కోవిడ్‌ మేనేజ్‌మెంట్లో దేశానికే ఆదర్శంగా... 
కోవిడ్‌ మేనేజ్‌మెంట్లో దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు ముఖ్యమంత్రి. గ్రామ స్థాయిలోనే వైయస్సార్‌ హెల్త్‌క్లినిక్స్‌ కడుతున్నామని.. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను తీసుకు వస్తున్నామన్నారు.  నాడు – నేడు కార్యక్రమాలతో ఆస్పత్రులను ఆధునీకరిస్తున్నామన్నారు.

కొత్త 104,108లు మన కళ్లముందే తిరుగుతున్నాయని.. ప్రభుత్వ రంగంలోనే మరో 16 వైద్యకళాశాలలు, నర్సింగ్‌కాలేజీలు కడుతున్నామన్నారు. ఇందులో 4 చోట్ల వేగంగా పనులు జరుగుతున్నాయి: వైద్యం కారణంగా అప్పులుబారిన పడాల్సిన అవసరం లేకుండా చూస్తున్నామన్నారు.

ప్రతి ఆస్పత్రిలో ఉండాల్సిన సిబ్బందిని పెడుతున్నాం. ఫిబ్రవరి చివరినాటికి 39 వేలమందిని పెడుతున్నాం. ఇప్పటికే 20వేల మందిని పెట్టాం. వారితో సేవలందిస్తున్నామన్నారు. మిగిలిన పోస్టులన్నీకూడా త్వరలోనే భర్తీచేస్తాం.
ప్రతి ఆస్పత్రిలో కూడా ఎంతమంది డాక్టర్లు ఉండాలో, అంతమందినీ పెడుతున్నామని చెబుతూ.. చివరగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు వైఎస్ జగన్. 

click me!