రమేష్ కుమార్ కు ఉద్వాసన: జగన్ ప్రభుత్వం కౌంటర్ ఇదీ...

By telugu teamFirst Published Apr 18, 2020, 7:07 PM IST
Highlights

తనను తొలగించడాన్ని సవాల్ చేస్తూ మాజీ ఎస్ఈసీ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. రమేష్ కుమార్ పిటిషన్ ను తోసిపుచ్చాలని కోరింది.

అమరావతి: మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)ను తొలగించే అధికారం గవర్నర్ కు ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు మాజీ ఎస్ఈసీ నిమమగడ్డ రమేష్ కుమార్ వేసిన పిటిషన్ మీద పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది శనివారం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. 

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వాన్ని సంప్రదించలేదని ఆయన తెలిపారు. తనను తొలగించేందుకు ప్రభుత్వం ఆర్టినెన్స్ జారీ చేసిందే రమేష్ కుమార్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తెలిపారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకే ఆర్డినెన్స్ తెచ్చామని చెప్పారు. 

గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాతనే ఆర్డినెన్స్ తెచ్చామని, ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని నిర్ణయించే అధికారం గవర్నర్ కు ఉందని, గవర్నర్ ఆమోదించిన తర్వాత ప్రభుత్వానికి దురుద్దేశాలు అంటగట్టడం సరికాదని అంటూ ఆర్డినెన్స్ రాజ్యాంగ పరిధిలోనే ఉన్నందున నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటిషన్ ను తోసిపుచ్చాలని ఆయన కోరారు. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాతో మిగతా రాష్ట్రాలకు ఏ విధమైన పోలిక లేదని చెప్పారు. ఒడిశా, మహారాష్ట్ర, బెంగాల్ స్థానిక సంస్థల వాయిదా పరిస్థితులను కౌంటర్ లో ప్రభుత్వం వివరించింది.

స్థానిక సంస్థలు వాయిదా పడినా ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించడం సరి కాదని ద్వివేది అన్నారు. ఎన్నికల వాయిదా తర్వాత రమేష్ కుమార్ చర్యలు సరిగా లేవని ఆయన అన్నారు. ఆర్టికల్ 243 ప్రకారం ఎన్నికల కమిషనర్ పదవీకాలానికి, సర్వీస్ రూల్స్ విడిగా చూడాల్సిందేనని అన్నారు. 

click me!