సినీ ఫక్కీలో.. ప్రేమించిన యువతితోనే ప్రియుడి హత్యకు ప్లాన్..

Published : May 09, 2020, 08:50 AM IST
సినీ ఫక్కీలో.. ప్రేమించిన యువతితోనే ప్రియుడి హత్యకు ప్లాన్..

సారాంశం

ఎట్టకేలకు ఆమెను ఒప్పించిన కుటుంబసభ్యులు ప్రియుడి హత్యకు పథకం పన్నారు. అందులో భాగంగానే ఆమెతో దినే్‌షకు ఫోన్‌ చేయించి చీరాలలోని 216 జాతీయరహదారిపైకి పిలిపించారు.

వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. ఆమె ప్రేమను కుటుంబసభ్యులు అంగీకరించలేదు. అయినా.. అతనినే పెళ్లి చేసుకుంటానని యువతి పట్టుపట్టింది. దీంతో... యువతి తండ్రి, అన్న కలిసి ప్లాన్ వేశారు. నెమ్మదిగా యువతి మనసు మార్చేశారు. ఆమెతో నే ప్లాన్ చేయించి ఆమె ప్రేమించిన యువకుడిని అతి దారుణంగా హత్య చేశారు. ఈ దారుణ సంఘటన ప్రకాశం జిల్లా చీరాలలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... చీరాలకు చెందిన నల్లగొండ్ల దినేష్‌(21) గుంటూరు జిల్లా వెదుళ్లపల్లికి చెందిన ఓ అమ్మాయితో ప్రేమ వ్యవహా రం కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా ఆమె ఇంటిలో గొడవలు జరుగుతున్నాయి. 

ఎట్టకేలకు ఆమెను ఒప్పించిన కుటుంబసభ్యులు ప్రియుడి హత్యకు పథకం పన్నారు. అందులో భాగంగానే ఆమెతో దినే్‌షకు ఫోన్‌ చేయించి చీరాలలోని 216 జాతీయరహదారిపైకి పిలిపించారు.

ప్రియురాలి అన్న కంపా విజయ్‌.. వంశీ, యేసు అనే ఇద్దరి సహకారం తీసుకున్నాడు. ముగ్గురూ దినేష్‌ వెంటపడి కోడికత్తితో గొంతులో పొడిచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన దినేష్‌ రోడ్డు పక్కన గల కృపానగర్‌లోకి పరిగెత్తాడు. 

ఓ ఇంటి సమీపంలోని చెట్టుకింద  కుర్చీలో కూలబడి అలాగే మృతిచెందాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న డీఎస్పీ జయరామ సుబ్బారెడ్డి, రూరల్‌ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై వేముల సుధాకర్‌ స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. నాలుగు బృందాలుగా ఏర్పడి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Weather Update: ఏపీ, తెలంగాణలో మారిన వాతావరణం.. 15 జిల్లాలకు హై అలర్ట్.. అక్కడ తుపాను గండం
అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu