విశాఖ జిల్లాలో యువతిపై ప్రేమోన్మాది దాడి: బాధితురాలి ఫిర్యాదుతో నానాజీ అరెస్ట్

Published : Dec 16, 2022, 10:28 AM ISTUpdated : Dec 16, 2022, 10:57 AM IST
విశాఖ జిల్లాలో యువతిపై   ప్రేమోన్మాది దాడి: బాధితురాలి  ఫిర్యాదుతో నానాజీ అరెస్ట్

సారాంశం

 ఉమ్మడి విశాఖ జిల్లా అచ్యుతాపురంలో  యువతిపై నానాజీ అనే యువకుడు కోడికత్తితో  దాడి చేశాడు. ఈ  దాడిని అడ్డుకొనేందుకు యత్నించిన  యువతి తల్లిపై నిందితుడు దాడి చేశాడు.

విశాఖపట్టణం: ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలోని అచ్యుతాపురంలో  గురువారం నాడు అర్ధరాత్రి నానాజీ అనే యువకుడు యువతిపై కోడికత్తితో దాడికి దిగాడు. అడ్డొచ్చిన తల్లిపై ఇనుప రాడ్ తో  నిందితుడు దాడి చేశాడు.ఈ విషయమై బాధితురాలు  ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు నానాజీని పోలీసులు అరెస్ట్  చేశారు.

ఉమ్మడి విశాఖపట్టణం  జిల్లాలోని అచ్యుతాపురంలో ఉంటే యువతిని  నానాజీ ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని బాధితు రాలు ఆరోపిస్తున్నారు. నిన్న రాత్రి నానాజీ యువతి ఇంటికి వెళ్లారు. తనను ప్రేమించాలని వేధించాడు.యువతితో వాగ్వాదానికి దిగాడు. తన వెంట తెచ్చుకొన్న కోడికత్తితో దాడి చేశాడు.ఈ సమయంలో యువతి తల్లి నిందితుడు నానాజీని  అడ్డుకునే ప్రయత్నం చేసింది.దీంతో  నానాజీ యువతి తల్లిపై ఇనుప రాడ్డుతో  దాడి చేశాడు. నానాజీ దాడితో  బాధితులు కేకలు వేశారు.  దీంతో స్థానికులు  వెంటనే రావడంతో నిందితుడు పారిపోయాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు  చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా  నిందితుడు నానాజీని పోలీసులు  అరెస్ట్  చేశారు.

ప్రేమకు నిరాకరించారని  యువతులపై యువకులు దాడులు చేస్తున్న ఘటనలు దేశంలోని పలు రాష్ట్రాల్లో  రోజూ ఏదో ఒక చోట చోటు చేసుకుంటున్నాయి.రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహ ఘటనలు  ఇటీవల కాలంలో  ఎక్కువగా నమోదౌతున్నాయి.  నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఈ ఏడాది సెప్టెంబర్  22న  ముషీరాబాద్ భోలక్ పూర్ బస్తీకి చెందిన యువతిపై  ఓయూ వద్ద  యువకుడు కత్తితో దాడి చేశాడు. కొంతకాలంగా యువతిని ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు.  మాట్లాడుదామని ఓయూ వద్దకు యువతిని తీసుకువచ్చి  కత్తితో దాడి చేశాడు.ఈ ఏడాది ఆగస్టు  10న నల్గొండలో  రోహిత్ అనే యువకుడు యువతిపై  కత్తితో దాడికి దిగాడు. తన ప్రేమను నిరాకరించిందని యువతిపై నిందితుడు కత్తితో దాడి చేశాడు. స్నేహితురాలితో  యువతిని  పిలిపించి  దాడికి దిగాడు నిందితుడు. నిందితుడిని పోలీసులు అరెెస్ట్  చేశారు.

also read:హైద్రాబాద్ మియాపూర్‌లో ప్రేమోన్మాది దాడి: యువతి తల్లి శోభ మృతి

ఈ నెల డిసెంబర్  6వ తేదీన గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెళ్లపాడులో  వైద్య విద్యార్ధిని తపస్విపై  జ్ఞానేశ్వర్ అనే యువకుడు  సర్జికల్ బ్లేడ్ తో దాడికి దిగాడు.ఈ దాడిలో  ఆసుపత్రిలో  చికిత్స పొందుతూ  యువతి మరణించింది. తపస్విపై దాడి చేసిన నిందితుడు తాను గొంతుకోసి ఆత్మహత్యాయత్నం చేశాడు.  వీరిద్దరి మధ్య కొంతకాలం ప్రేమ వ్యవహరం నడిచింది. జ్ఞానేశ్వర్ గురించి తెలుసుకున్న యువతి అతడిని దూరం పెట్టింది. దీంతో నిందితుడు ఆమె పై దాడి చేశాడు.తమిళనాడు రాష్ట్రంలోని  ఆదంబాక్కంలో  కదులుతున్న రైలు ముందు యువతిని నెట్టాడు సతీష్. దీంతో  రైలు కింద పడి యువతి  మృతి చెందింది.ఈ ఘటన ఈ ఏడాది అక్టోబర్  14న జరిగింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Palla Srinivas on Lokesh Birthday: లోకేష్అంటే నమ్మకం.. నిత్యంప్రజల్లోనే ఉంటారు | Asianet News Telugu
Legendary Actor Krishnam Raju 86th Birth Anniversary | Free Mega Diabetes Camp | Asianet News Telugu