ఘాటు పెంచిన పీవీపీ-కేశినేని: ఆస్తుల వేలంపై పోటాపోటీ ట్వీట్లు

Siva Kodati |  
Published : Aug 04, 2019, 12:34 PM IST
ఘాటు పెంచిన పీవీపీ-కేశినేని: ఆస్తుల వేలంపై పోటాపోటీ ట్వీట్లు

సారాంశం

విజయవాడ ఎంపీ కేశినేని నాని, వైసీపీ నేత పీవీపీల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. కొద్దికాలం సుతిమెత్తగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న ఇద్దరు నేతలు తాజాగా ఘాటు పెంచారు. ఇద్దరు పోటా పోటీగా ట్వీట్లు చేస్తూ బెజవాడలో హీట్ పెంచేస్తున్నారు

విజయవాడ ఎంపీ కేశినేని నాని, వైసీపీ నేత పీవీపీల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. కొద్దికాలం సుతిమెత్తగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న ఇద్దరు నేతలు తాజాగా ఘాటు పెంచారు. ఇద్దరు పోటా పోటీగా ట్వీట్లు చేస్తూ బెజవాడలో హీట్ పెంచేస్తున్నారు.

పీవీపీకి చెందిన చెన్నై ఆస్తుల వేలంపై బ్యాంక్ ప్రకటనను కేశినేని నాని ట్వీట్ చేయగా.. కేశినేని నాని కార్గో వేలానికి సంబంధించిన బ్యాంక్ ప్రకటనను పీవీపీ పోస్ట్ చేస్తూ అదనంగా టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్‌పైనా వరప్రసాద్ విమర్శలు చేశారు.

చంద్రబాబు.. తమరు రోడ్లు మీద కార్న్ తింటూ కులాసాగా తిరుగుతున్నారు. ఇక్కడ మీ సహచరుడు శ్రీ. ఇస్మార్ట్ నాని వ్యాపారాలు మూసేసి అందరిని రోడ్డున పడేసి బెజవాడను దివాలా తీస్తున్నాడు. తమరు దయచేసి,ఆ హెరిటేజ్ పాలు పంపిస్తే, బారులు తీరిన అప్పుల వాళ్లకు,ఓ కప్పు కాఫీ ఇస్తాం’అంటూ ఎద్దేవా చేశారు. నారా లోకేష్, కేశినేనిలను ట్యాగ్ చేశారు.

‘Coming soon బ్లాక్ బస్టర్స్... మాయా దేశం,బొబ్బిలి పిల్లి, మైనర్ 'చంద్ర'కాంత్, సర్దార్ పప్పల రాయుడు,అడవి చంద్రుడు, సమర చంద్రా రెడ్డి, నరకాసుర నాయుడు, కొండవీటి శునకం, ఇన్జస్టీస్ చౌదరి, వెన్నుపోటు వేటగాడు, జై తారక రామ’అంటూ మరో ట్వీట్ వదిలారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్