భార్యకు ఓటేయలేదని.. రోడ్డు తవ్వి పోశాడు... ఓ వైసీపీ నేత ఘాతుకం.. (వీడియో)

By AN TeluguFirst Published Feb 20, 2021, 4:17 PM IST
Highlights

చిత్తూరు జిల్లా వీ.కోటలో వైసీపీ నాయకుడి ఆగడాలు మితిమీరిపోయాయి. ఏకంగా రెండు గ్రామాలను కలిసే రోడ్డును తవ్వి పోశాడు. ఇంతకీ ఆ గ్రామస్తులు చేసిన తప్పేంటంటే వార్డ్ మెంబర్ గా అతని భార్యను గెలిపించకపోడమే. 

చిత్తూరు జిల్లా వీ.కోటలో వైసీపీ నాయకుడి ఆగడాలు మితిమీరిపోయాయి. ఏకంగా రెండు గ్రామాలను కలిసే రోడ్డును తవ్వి పోశాడు. ఇంతకీ ఆ గ్రామస్తులు చేసిన తప్పేంటంటే వార్డ్ మెంబర్ గా అతని భార్యను గెలిపించకపోడమే. 

"

సర్పంచ్ ఎన్నికలలో వార్డ్ మెంబర్ గా పోటీచేసిన తన భార్యను యర్రంపల్లి గ్రామస్తులు ఓడించారని కోపంతో నెర్ని పల్లి నుండి యర్రంపల్లి గ్రామానికి మధ్యనున్న రోడ్డును తవ్విపోశాడు. దీంతో రాకపోకలు ఎక్కడివక్కడే నిలిచిపోయి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

బోడి గుట్టపల్లి పంచాయతీ యర్రంపల్లి  గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు రమేష్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఇక్కడున్న మట్టిరోడ్డుకు సీసీ రోడ్డు మంజూరు కావటంతో రోడ్డు పనులు ప్రారంభిస్తుంటే రమేష్ అడ్డుకున్నాడు.

అంతేకాదు గ్రామానికి వెళ్లే దారి తన పట్టా భూమి అంటూ దారికి అడ్డంగా జేసీబీతో పెద్ద గుంత తీశాడు. స్థలాన్ని గ్రామస్తులకు నడిచి వెళ్లడాని మాత్రమే అనుమతి ఇచ్చామని, ఇప్పుడు సీసీ రోడ్డు వేస్తే తమ ప్లేస్ పోతుందని, వేయటానికి వీలు లేదని రమేష్  అడ్డుకున్నాడు. దీంతో గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

click me!