అరుంధతి సినిమాలో పశుపతిలా వైసీపీ ఫేక్ ప్రచారాలు... ప్రజలే తిప్పి కొట్టాలని మహాసేన రాజేష్‌ పిలుపు

By Galam Venkata Rao  |  First Published Jul 18, 2024, 5:42 PM IST

‘‘అరుంధతి సినిమాలో పశుపతి అరాచకాలను తట్టుకోలేక అతణ్ని బతికి ఉండగానే సమాధి చేశారు. అంతకంటే ఘోరమైన వైసీపీని ప్రజల సహకారంతో చంద్రబాబు సమాధి చేశారు.’’


వైసీపీ పెంచి పోసించిన గంజాయి, దిగుమతి చేసిన డ్రగ్స్‌తోనే ఆంధ్రప్రదేశ్‌లో విచ్చలవిడి నేరాలు జరుగుతున్నాయని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ అన్నారు. నేరాలకు పునాది వేసింది వైసీపీయేనని, కమీషన్ల కోసం కక్కుర్తిపడి అందించిన ట్యాబ్‌లలో నీలిచిత్రాలను చూసి మైనర్లు కూడా మానభంగాలు చేస్తున్నారని మండిపడ్డారు. మళ్లీ సిగ్గులేకుండా రాష్ట్రంలో ఏమూలన ఏ నేరం జరిగినా దాన్ని టీడీపికి అంటగడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న నేరాలపై ఆయన మంగళగిరిలోని టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైసీపీ పుట్టింది, బతుకుతుంది తప్పుడు ప్రచారంలోనేనని విమర్శించారు. వైసీపీని చంద్రబాబు సమాధి చేశారని... ప్రేతాత్మగా మారిన వైసీపీ ఆ సమాధిలోనుండి ఫేక్ ప్రచారం మొదలుపెట్టిందని ఎద్దేవా చేశారు.

‘‘అరుంధతి సినిమాలో పశుపతి అరాచకాలను తట్టుకోలేక అతణ్ని బతికి ఉండగానే సమాధి చేశారు. అంతకంటే ఘోరమైన వైసీపీని ప్రజల సహకారంతో చంద్రబాబు సమాధి చేశారు. అరుంధతి సినిమాలో ప్రేతాత్మగా మారిన పశుపతి సమాధి నుంచి బయటకు రావడానికి ప్రయత్నించినట్లే నేడు వైసీపీ కూడా ఆ సమాధి నుంచి బయటకు రావడానికి దుష్ప్రచారాలను మొదలు పెట్టింది. హత్యాచారాలు, దారుణాలు జరిగిపోతున్నాయంటూ గగ్గోలు పెడుతున్నారు. చంద్రబాబు అధికారం చేపట్టాక రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛావాయులు పీల్చుకుంటున్నారు. వైసీపీ పాలనలో ఫోన్ మాట్లాడుకోవాలన్న భయపడే పరిస్థితి ఉండేది’’ అని చెప్పారు.

Latest Videos

undefined

‘‘కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఉన్న యువతకు భవిష్యత్తుపై కొత్త ఆశలు చిగురించాయి. ఒకవైపు పోలవరం నిర్మాణం, మరోవైపు రాజధాని నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరణ చేయడం లేదు. దానికి మైన్స్ కూడా కేటాయిస్తామని కేంద్ర మంత్రులే వచ్చి స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధివైపు అడుగులు వేస్తుంటే ఈ అభివృద్ధిని నాశనం చేయాలని ఆ సమాధిలో ఉన్న వైసీపీ భూతం మళ్లీ తప్పుడు ప్రచారం మొదలు పెట్టింది. నాడు కోడికత్తి డ్రామాకు తెరతీసి.. అది చంద్రబాబ చేయించారని అబద్దాలు ప్రచారం చేశారు. అలాగే, సొంత బాబాయిని గొడ్డలితో నరికి చంపి చంద్రబాబుకు అంటగట్టిన అబద్దాల కోరులు ఈ వైసీపీ నేతలు. ఈ అబద్దాలకోరులను 11 సీట్లకు పరిమితం చేసి ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా వారికి బుద్ధి రావడంలేదు. యాక్సిడెంట్‌లో డిడైవర్‌ను ఢీకొట్టి చనిపోయినా అది టీడీపీ చేసిన హత్యేనంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎవరైనా కుటుంబ కలహాలతో ఉరివేసుకున్నా దాన్ని టీడీపీకి రుద్దుతున్నారు. ఈ తప్పుడు ప్రచారాలను చూస్తుంటేనే సిగ్గుగా ఉంది.’’ 

‘‘రూ.3000 కోట్ల ఫీజు బకాయిలు కట్టకుండా విద్యార్థులను వైసీపీ ఇబ్బంది పెడితే నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ఆ సమస్యను పరిష్కరించారు. దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రత్యేక జీవోను తీసుకువచ్చి వారికి న్యాయం చేసిన గొప్ప వ్యక్తి నారా లోకేష్. 25 మందికోసం కూడా ప్రభుత్వం దిగివస్తుందని కూటమి ప్రభుత్వం నిరూపించింది. ఈ రాష్ట్రంలో ఉన్న పౌరులందరి శ్రేయస్సుకోసం పాటుపడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. కువైట్‌లో ఒక వ్యక్తి  బాధ పడుతుంటే చలించిపోయిన వ్యక్తి లోకేష్.. అతణ్ని ఇంటికి చేర్చేందుకు కృషిచేశారు.  కేవలం 25 కుటుంబాలే కాదు, ఒక్క వ్యక్తి అయినా.. ఒక్క కుటుంబమైన ఈ ప్రభుత్వానికి ఎంత ముఖ్యమో ఈ ఘటనతో అర్థం చేసుకోవచ్చు.’’

‘‘వైసీపీ పాలనలో కంచే చేనును మేసింది. రాజమండ్రిలో మార్గాని భరత్ తన జీబును తానే తగలబెట్టుకుని దాన్ని టీడీపీపై రుద్దాడు. తూర్పు గోదావరిలో అంబేద్కర్ విగ్రహాలపై దాడి చేసి టీడీపీ నేతలపై తప్పుడు ప్రచారం చేశారు. డాగ్ స్వాడ్‌తో ఎంక్వైరీ చేస్తే వైసీపీ నేతలు అరెస్టయ్యారు. కూటమి ప్రభుత్వాన్ని ఎలాగైనా భద్నం చేయడానికి చూస్తున్నారు. దానికోసం వాళ్లే చిన్నపిల్లలు తినే ఆహారంలో విషం కలిపినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఫేక్ ప్రచారంతో ఒకసారి నెగ్గారు. రెండోసారి సమాధి అయ్యారు. ఇప్పుడు ఎక్కడో క్షణికావేశంలో జరుగుతున్న నేరాలను చంద్రబాబు ప్రభుత్వానికి రుద్దుతున్నారు.’’

‘‘చంద్రబాబు శాంత స్వాభావి. ఆయన దాడులు చేయమని చెప్పరు. ప్రతిపక్షలో ఉన్నప్పుడు మేము దాడులకు గురవుతున్నప్పుడు అధికారంలోకి వస్తే మాకు ప్రతికారం తీర్చుకునే అవకాశం ఇవ్వాలని మేము అంటే చంద్రబాబు మాకు ఒక మాట చెప్పారు. కాలువలో కొట్టుకుపోతున్న తేలును కాపాడబోయిన స్వామిని అది పదేపదే  కుడుతున్నా... ఆయన దాన్ని కాపాడారు. కుట్టడం తేలు నైజం కాపడటం మనిషిగా మన నైజం. దానిపని అది చేసింది. మన పని మనం కరెక్ట్ గా చేయాలని మా నాయకుడు చెప్పారు. వైసీపీ వాళ్లు నేరస్తులు.. వాళ్లు నేరస్తులు కాబట్టి నేరాలే చేస్తారు. కానీ టీడీపీ పార్టీలో అందరూ నాయకులు ఉన్నారు. నాయకులు ఎప్పుడూ.. ఎన్ని దాడులైనా తట్టుకుని ప్రజలకోసం పనిచేస్తారు తప్పా తిరిగి దాడి చేయరు.’’
 
‘‘వైసీపీ వాళ్లు ఘోరమైన నేరాలు చేశారు కాబట్టే 11 సీట్లకు పరిమితం అయ్యారు. నాడు మా నాయకుడిని చంపేద్దామనుకున్నారు, దాడులు చేశారు. తప్పుడు  కేసులు పెట్టి జైల్లో పెట్టారు. నారా లోకేష్ మీద రాళ్లతో దాడులు చేయించి ఆయన్ను చంపాలని చూశారు. టీడీపీ కార్యకర్తల మీద దాడులు చేశారు. తల్లిలాంటి భువనేశ్వరమ్మ మీద ఆరోపణలు చేశారు. వైసీపీ నేతలు దారుణమైన నేరస్తులు. రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తుంటే నేరాంధ్రప్రదేశ్‌గా మారిపోయిందని ఆరోపిస్తున్నారు. అరుంధతి సినిమాలో ఎలాగైతే పశుపతి సమాధిని బద్దలు కొట్టుకుని బయటకు రావడానిని ప్రయత్నించాడో నేడు వైసీపీ నేతలు అలా బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. వైసీపీ భూతాలను సమాధిలో నుంచి బయటకు రానిస్తే ఏపీని స్మశానం చేసేస్తాయి. ఏపీని స్మశానం చేయడానికే తప్పుడు ప్రచారాలతో ప్రజల మద్దతు పొందడానికి చూస్తున్నారు. ఈ  తప్పుడు ప్రచారాలను ప్రజలు గమనించాలి. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీ తప్పుడు ప్రచారంలో పడకండి. ఆ తప్పుడు ప్రచారం నమ్మి రాష్ట్రంలో చంద్రబాబు సమాధి చేసిన వైసీపీ భూతాలను మళ్లీ బయటకు రానివ్వద్దు.’’

‘‘మా నాయకులు చంద్రబాబు, లోకేష్ నిరంతరం  అభివృద్ధివైపే పయనం సాగిస్తున్నారు. ఎక్కడా కూడా కక్షసాధింపు చర్యలు, ప్రతికార దాడులను వాళ్లు ప్రోత్సహించడం లేదు. అలా ప్రోత్సహించే మాట అయితే టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసిన ఏ ఒక్కడు ఈ రోజు ప్రాణాలతో ఉండేవాడు కాదు. తల్లిలాంటి మా భువనేశ్వరమ్మని అవమానించిన వాడు ఎవ్వడూ నేడు ఊపిరి పీల్చేవాడు కాదు. కాని మా నాయకుడు మాకు క్రమశిక్షణ నేర్పించారు. నాయకులు అంటే ఒక దెబ్బ పడైనా ప్రజలవైపు నిలబడాలి కానీ తిరిగి దాడులు చేయకూడదని నేర్పించారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక కూడా 8 మంది టీడీపీ కార్యకర్తలను వైసీపీ నేతలు హత్య చేశారు. దాన్నితప్పుదోవ పట్టించడానికి, విజయసాయిరెడ్డిపై వస్తున్న అక్రమ సంబంధాల ఆరోపణల టాపిక్ డైవర్ట్ చేయడానికి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇది ప్రజలు గమనించి రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరుతున్నా.’’ అని మహాసేన రాజేష్ పేర్కొన్నారు.

 

click me!