సామాజిక న్యాయానికి పెద్దపీట: ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించిన వైసీపీ

By narsimha lode  |  First Published Feb 20, 2023, 2:22 PM IST

ఏపీ రాష్ట్రంలో  వైసీపీ  అభ్యర్ధు ల జాబితాను  వైసీపీ  ఇవాళ ప్రకటించింది. 


అమరావతి: ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో ఎమ్మెల్సీ  అభ్యర్ధులను   వైసీపీ సోమవారం నాడు   ప్రకటించింది.  ఏపీ రాష్ట్ర ప్రభుత్వ  సలహదారు  సజ్జల రామకృష్ణారెడ్డి  ఈ జాబితాను  మీడియాకు విడుదల చేశారు.  

స్థానిక సంస్థల కోటా  ఎమ్మెల్సీ  అభ్యర్ధులు 

Latest Videos

undefined

1.శ్రీకాకుళం-రామారావు
2.తూర్పుగోదావరి-  సూర్యానారాయణ
3 కడప-రామసుబ్బారెడ్డి
4.పశ్చిమ గోదావరి- కౌరు శ్రీనివాస్
5.కర్నూల్  -డాక్టర్ మధుసూధన్
6.అనంతపురం - ఎస్. మంగమ్మ
7. నెల్లూరుఎం. మురళీధర్
8.చిత్తూరు-సుబ్రమణ్యం
9.పశ్చిమగోదావరి-వంకా రవీంద్రనాథ్

ఎమ్మెల్యే  కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధులు 

1.విజయనగరం-పీవీపీ  సూర్యనారాయణరాజు
2. ప్రకాశం- పోతుల సునీత
3.విశాఖపట్టణం- కోలా గురువులు
4.తూర్పుగోదావరి-బొమ్మి ఇజ్రాయిల్
5.ఏలూరు-జయమంగళవెంకటరమణ
6.గుంటూరు-చంద్రగిరిఏసురత్నం
7.పల్నాడు-మర్రి రాజశేఖర్ 

గవర్నర్ కోటా  ఎమ్మెల్సీ అభ్యర్ధులు

1.అల్లూరి సీతారామరాజు- కుంభా రవిబాబు
2.కాకినాడ-కర్రి పద్మశ్రీ

 

మొత్తం  18  ఎమ్మెల్సీ  స్థానాలకు   అభ్యర్ధులను   సజ్జల రామకృష్ణారెడ్డి  ప్రకటించారు.  ఈ 18 మందిలో  11 మంది  బీసీలు,  ఇద్దరు ఎస్సీలు, ఒకరు ఎస్టీ,  నలుగురు ఓసీలకు   కట్టబెట్టినట్టుగా  సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.  స్థానిక  సంస్థల  కోటా  కింద  తొమ్మిది మంది,  ఎమ్మెల్యే కోటాలో  ఏడుగురు, గవర్నర్  కోటా  ఇద్దరు  అభ్యర్ధులను  ఖరారు చేసినట్టుగా  సజ్జల రామకృష్ణారెడ్డి  వివరించారు. 

తమ పార్టీ అధికారంలోకి  వచ్చిన నాటి నుండి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు  ఉప ముఖ్యమంత్రి పదవులు  ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు  చేశారు..వైసీపీ  సామాజిక న్యాయానికి  కట్టుబడి  ఉందని  పదవుల పంపకం  ద్వారా తేటతెల్లం అయిందన్నారు. .    ఎన్నికల్లో  ఓట్ల  కోసం  నినాదాలిచ్చే పార్టీ తమది కాదని ఆయన  తేల్చి  చెప్పారు.  ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీల్లో  భాగంగా  బీసీ, ఎస్సీ, ఎస్టీ , మైనారిటీల కు  పదవులు  కేటాయించినట్టుగా   సజ్జల రామకృష్ణారెడ్డి  వివరించారు.

శాసనమండలిలో  బీసీ సామాజిక వర్గానికి  చెందిన  ఎమ్మెల్సీల సంఖ్య  19కి  చేరుతుందని ఆయన  చెప్పారు.  ఓసీ సామాజిక వర్గానికి  చెందిన  ఎమ్మెల్సీల సంఖ్య  14కి  చేరుకుంటుందని  సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

టీడీపీ హయంలో  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు  శాసనమండలిలో  37 శాతం  మాత్రమే  ప్రాతినిథ్యం  ఉన్న విషయాన్ని  సజ్జల రామకృష్ణారెడ్డి  గుర్తు  చేశారు.  వైసీపీ  హయంలో  బీసీలకు  43 శాతం  ఎమ్మెల్సీ  పదవులు దక్కాయని  సజ్జల రామకృష్ణారెడ్డి  వివరించారు.  అంతేకాదు  శాసనమండలిలో  బీసీ, ఎస్సీ, ఎస్టీలకు  48 శాతం  పదవులు  ఇచ్చిన ఘనత  వైసీపీకే దక్కుతుందని  ఆయన  చెప్పారు.  సామాజిక సాధికారిత  అంటే తమదేనని  ఆయన  చెప్పారు. చంద్రబాబునాయుడు మాటల్లో  చెబితే  వైఎస్ జగన్  ఆచరించి  చూపారన్నారు.

ఎమ్మెల్యే  కోటా  కింద  ప్రకటించిన  అభ్యర్ధుల జాబితాలో  నలుగురు బీసీలు,  ఒకరు  ఎస్సీ,  ఇద్దరు ఓసీ సామాజిక వర్గానికి  చెందిన వారని  సజ్జల రామకృష్ణారెడ్డి  చెప్పారు..  గవర్నర్ కోటా  కింద  ప్రతిపాదించిన అభ్యర్ధుల్లో  ఒకరు  ఎస్టీ, ఒకరు బీసీ సామాజిక వర్గానికి  చెందినవారున్నారని ఆయన తెలిపారు. 

click me!