పెళ్లైన గంటల్లోనే నూతన వధువు మృతి: భర్తతో డ్యాన్స్ చేసిన కొద్దిసేపటికే...

Published : Mar 31, 2024, 07:38 AM IST
పెళ్లైన గంటల్లోనే నూతన వధువు మృతి:    భర్తతో డ్యాన్స్ చేసిన కొద్దిసేపటికే...

సారాంశం

పెళ్లైన కొద్ది గంటల్లోనే నూతన వధువు భర్తతో డ్యాన్స్ చేసింది. అయితే  ఆ తర్వాత నిద్రలోనే ఆమె మృతి చెందింది.ఈ ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటుచేసుకుంది.

పార్వతీపురం:నూతన వధువు భర్తతో కలిసి డ్యాన్స్ చేసిన కొన్ని గంటల్లోనే మృతి చెందిన విషాద ఘటన  పార్వతీపురం మన్యం జిల్లాలో చోటు చేసుకుంది.ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.

జిల్లాలోని  మక్కువ మండలం దబ్బగెడ్డ గ్రామానికి చెందిన  భాస్కరరావుతో  పార్వతీపురం మండలం కొత్తవలస గ్రామానికి చెందిన అఖిలతో ఈ నెల 29న వివాహాం జరిగింది. అయితే ఈ నెల  30వ తేదీ తెల్లవారుజాము వరకు  పెళ్లి ఊరేగింపు నిర్వహించారు. డీజే పాటలకు  అనుగుణంగా భర్తతో పాటు  కలిసి  అఖిల డ్యాన్స్ చేసింది. డ్యాన్స్ చేసిన కొద్దిసేపటికే నీరసంగా ఉందని  అఖిల నిద్రపోయింది.  అయితే అఖిలను బంధువులు ఎంత లేపినా ఆమె లేవలేదు. వెంటనే ఆమెను మక్కువ పీహెచ్‌సీకి తరలించారు. వైద్యులు అఖిలకు  ప్రాథమిక చికిత్స చేశారు. ఆ తర్వాత ఆమెను  సాలూరు ఆసుపత్రికి తరలించారు.  సాలూరు ఆసుపత్రిలో వైద్యులు  అఖిలను పరీక్షించారు. అప్పటికే అఖిల మృతి చెందిందని  ప్రకటించారు.

పెళ్లికి ముందు రోజు అఖిల ఉపవాసం ఉంది.  పెళ్లి రోజున  ఊరేగింపులో డ్యాన్స్ చేసింది. దీంతో  డీ హైడ్రేషన్ తో  మృతి చెందిందని  అనుమానిస్తున్నారు.  పెళ్లైన గంటల్లోనే  అఖిల మృతి చెందడంతో  ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.  

కోటి ఆశలు, కొత్త ఆకాంక్షలతో  వివాహ జీవితంలోకి అడుగు పెట్టిన గంటల వ్యవధిలోనే అఖిల మృతి చెందిన విషయం తెలిసిన  స్థానికులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అఖిల పేరేంట్స్  లేరు. నానమ్మ,తాతయ్యల వద్దే  అఖిల పెరిగింది.  అఖిల మృతి చెందడంతో  నానమ్మ, తాతయ్యలు కూడ విలపిస్తున్నారు. 


 

PREV
click me!

Recommended Stories

ఎలక్షన్ ముందు అడిగారు వెంటనే అది చేయండి: పవన్ | Handicrafts Festival 2026 Stalls
Prashna Ravan Controversy: నోరుంది కదా అని వాగితే...రావణ్ గతే పట్టుద్ది | Asianet News Telugu