చిత్తూరు జిల్లాలో ఘోరం: ప్రియుడిపై మోజు, మెడ విరిచేసి భర్తను చంపిన భార్య

Published : Jul 29, 2021, 10:25 AM ISTUpdated : Jul 29, 2021, 10:27 AM IST
చిత్తూరు జిల్లాలో ఘోరం: ప్రియుడిపై మోజు, మెడ విరిచేసి భర్తను చంపిన భార్య

సారాంశం

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో ఓ మహిళ అత్యంత దారుణమైన కార్యానికి ఒడిగట్టింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే ఉద్దేశంతో భర్తను హత్య చేసి గుండెపోటుతో మారణించాడని డ్రామా ఆడింది.

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఓ మహిళ అత్యంత ఘోరానికి ఒడిగట్టింది. ప్రియుడితో మోజుతో భర్తను చంపేసి గుండెపోటుతో మరణించాడని నాటకామాడింది. కుమారుడికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన వెలుగు చూసింది. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి మండలంలోని అరిగివారిపల్లెలో జరిగింది.

పోలీసులు అనుమానంతో మహిళను అరిగివారిపల్లెలో అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో వాసు అనే వ్యక్తి అటెండర్ గా పనిచేస్తున్నాడు. అతని భార్య స్వప్నప్రియ. వారికి ఓ కుమారుడు ఉన్నాడు. అయితే, స్వప్నప్రియ మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది.

తన వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే ఉద్దేశంతో భర్తను హత్య చేయాలని పథకం వేసింది. భర్త వాసు మెడను విరిచి అతన్ని చంపేసింది. మెడపై గాయాలు కనిపించడంతో అనుమానం వచ్చి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారించారు. వాసు మెడ విరిగినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. విచారణలో స్వప్నప్రియ తన నేరాన్ని అంగీకరించింది. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu