Andhra Pradesh: ఇష్టం లేకుండా ముద్దు పెట్టడానికి వచ్చాడని భర్త నాలుక కొరికేసిన భార్య

Published : Jul 21, 2023, 09:01 PM IST
Andhra Pradesh: ఇష్టం లేకుండా ముద్దు పెట్టడానికి వచ్చాడని భర్త నాలుక కొరికేసిన భార్య

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో ఓ భార్య, భర్త నాలుకను కొరికేసింది. ఇద్దరి మధ్య గొడవ తర్వాత ఈ ఘటన జరిగింది. కర్నూలులో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.  

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. కర్నూలు జిల్లాకు చెందిన ఆ దంపతులు గత రెండు సంవత్సరాలుగా తరుచూ గొడవ పడుతున్నారు. ఒకరిపై ఒకరు వాగ్వాదానికి దిగుతున్నారు. ఈ క్రమంలో భర్త నాలుకను భార్య కొరికేసింది. దీంతో ఆయన హాస్పిటల్ పాలయ్యాడు.

గుంటూరు జిల్లాకు చెందిన తారాచంద్ నాయక్, కర్నూలు జిల్లా తుగ్గలి మండానికి పుష్పవతిని పెళ్లి చేసుకున్నాడు. 2015లో వారు ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత వారికి ఇద్దరు పిల్లల సంతానం కలిగింది. అంతా సజావుగానే సాగుతూ ఉన్నది. కానీ, రెండేళ్ల నుంచి వారి మధ్య ఘర్షణలు పెరిగాయి. తరుచూ ఒకరిపై ఒకరు వాదనలు చేసుకుంటున్నారు. గొడవ పడుతున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం కూడా వారిద్దరూ గొడవ పడ్డారు. కానీ, ఈ గొడవ జరిగుతున్నప్పుడు భార్య.. భర్త తారాచంద్ నాయక్ నాలుకను కొరికేశారు. 

Also Read: కోల్డ్ వార్ ఉండేది.. వివేకా హత్యకు రాజకీయపరమైన కారణాలు!: వైఎస్ షర్మిల వాంగ్మూలంలో కీలక వ్యాఖ్యలు

దీంతో తారాచంద్ లబోదిబోమని అరిచాడు. చికిత్స కోసం గుత్తి హాస్పిటల్‌కు వెళ్లారు. పరీక్షించిన వైద్యులు తారాచంద్‌కు మరింత మెరుగైన చికిత్స అందించడానికి అనంతపురం హాస్పిటల్‌కు సిఫార్సు చేశారు.

తనపై దాడి చేసిన భర్త తారాచంద్, తనకు ఇష్టం లేకుండా బలవంతంగా ముద్దు పెట్టుకోవడానికి వచ్చాడని, అందుకే ఇలా జరిగిందని భార్య పుష్పవతి జొన్నగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, భర్త మాత్రం అందుకు భిన్నంగా చెప్పారు. తన భార్యతో తనకు ముప్పు ఉన్నదని, అన్నారు. తన పిల్లలూ, తాను ఎలా బతకాలో అర్థం కావడం లేదని పేర్కొన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!