చంద్రబాబు వ్యూహం: కోట్ల ఫ్యామిలీతో జగన్‌కు చెక్

First Published Jan 29, 2019, 12:17 PM IST

రాయలసీమ జిల్లాల్లో వైసీపీ అధిపత్యాన్ని తగ్గించేందుకు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే కర్నూల్ జిల్లాలో కోట్ల ఫ్యామిలీని టీడీపీలో చేర్చుకొనేందుకు రంగం సిద్దం చేసింది

రాయలసీమ జిల్లాల్లో వైసీపీ అధిపత్యాన్ని తగ్గించేందుకు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే కర్నూల్ జిల్లాలో కోట్ల ఫ్యామిలీని టీడీపీలో చేర్చుకొనేందుకు రంగం సిద్దం చేసింది. టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడును కోట్ల ఫ్యామిలీ సోమవారం రాత్రి కలిశారు. వైసీపీ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు టీడీపీ కోట్ల ఫ్యామిలీని రంగంలోకి దింపింది. మరో వైపు కోట్ల ఫ్యామిలీ టీడీపీలో చేరిక విషయమై తనకు సమాచారం లేదని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చెప్పడం టీడీపీ నాయకత్వానికి తలనొప్పిగా మారింది.
undefined
2014 ఎన్నికల్లో కర్నూల్ జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించింది. టీడీపీ కేవలం మూడు అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. జిల్లాలోని రెండు ఎంపీ స్థానాల్లో వైసీపీ గెలిచింది. ఆ తర్వాత చోటు చేసుకొన్నపరిణామాల్లో వైసీపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు కూడ టీడీపీలో చేరారు.
undefined
అయితే 2019 ఎన్నికల్లో వైసీపీని నిలువరించేందుకు గాను చంద్రబాబునాయుడు వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు.కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని టీడీపీలో చేర్చుకోవడం ద్వారా రాజకీయంగా వైసీపీకి చెక్ పెట్టే అవకాశం ఉంటుందని బాబు భావించారుు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పట్ల అసంతృప్తితో ఉన్న కోట్ల కూడ టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యారు.
undefined
కర్నూల్ ఎంపీతో డోన్, కోడుమూరు అసెంబ్లీ స్థానాలను కూడ కోట్ల ప్యామిలీ అడుగుతోంది.కర్నూల్ ఎంపీ స్థానం ఇచ్చేందుకు చంద్రబాబునాయుడు సానుకూలంగా ఉన్నారు. డోన్ అసెంబ్లీ సీటు విషయంలోనే పేచీ వచ్చింది. 2004లో డోన్‌ ను కోట్ల సుజాతమ్మ కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. 2009లో ఈ స్థానం నుండి కేఈ కృష్ణమూర్తి విజయం సాధించారు. 2014లో కేఈ కృష్ణమూర్తి పత్తికొండ నుండి పోటీ చేసి గెలిచారు. అదే ఎన్నికల్లో డోన్ నుండి కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రతాప్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మరోసారి ఈ స్థానం నుండి పోటీకి కేఈ ప్రతాప్ రంగం సిద్దం చేసుకొంటున్నారు. ఈ తరుణంలో కోట్ల ఫ్యామిలీ ఈ సీటు కోసం పట్టుబడుతున్నారు. అయితే డోన్‌కు బదులుగా ఆలూరు ఇస్తామని చంద్రబాబునాయుడు కోట్ల ఫ్యామిలీకి హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు.
undefined
2019 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ప్రకటించారు. కేఈ కృష్ణమూర్తి తనయకుడు కేఈ శ్యాంబాబు పత్తికొండ నుండి టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగనున్నారు.పత్తికొండతో పాటు డోన్ అసెంబ్లీ స్థానం కోసం కూడ కేఈ కుటుంబం పట్టుబడే అవకాశం ఉంది. డోన్ కోసం కోట్ల ఫ్యామిలీ కూడ గట్టిగా కోరే అవకాశం ఉంది.
undefined
కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తనయుడు కోట్ల రాఘవేంద్రరెడ్డి కూడ పోటీకి ఆసక్తిగా ఉన్నారు. అయితే రాఘవేంద్ర రెడ్డి పోటీ చేసేందుకు అసెంబ్లీ స్థానం ఇచ్చేందుకు చంద్రబాబునాయుడు సానుకూలంగా లేరనే ప్రచారం కూడ సాగుతోంది. కోట్ల ఫ్యామిలీకి మూడు టిక్కెట్లు ఇచ్చి కేఈ కుటుంబానికి ఒక్క టిక్కెట్టు ఇస్తే సమస్య ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు.
undefined
ఈ పరిణామాల నేపథ్యంలో డోన్‌ విషయంలో రెండు వర్గాల మధ్య రాజీ మార్గాన్ని అనుసరించాలని టీడీపీ నాయకత్వం యోచిస్తోంది. ఎక్కువ స్థానాల్లో విజయం సాధించడం ద్వారా వైసీపీ ప్రాబల్యాన్ని తగ్గిస్తే రాజకీయంగా ప్రయోజనంగా టీడీపీ నాయకత్వం భావిస్తోంది. దరిమిలా డోన్‌కు బదులుగా మరో స్థానం కోట్ల ఫ్యామిలీకి ఇచ్చే అవకాశాలు కూడ లేకపోలేదంటున్నారు.
undefined
కోట్ల ఫ్యామిలీ టీడీపీలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కేఈ కృష్ణమూర్తి కుటుంబాన్ని డోన్ సీటు ఇవ్వడం ద్వారా అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం చేసే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
undefined
కర్నూల్ సిట్టింగ్ ఎంపీ బుట్టా రేణుకను వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయించనున్నారు. పాణ్యం నుండి ఆమెను బరిలోకి దింపే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే పాణ్యం కాకపోతే మరో స్థానం నుండి ఆమె పోటీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.
undefined
కేఈ ప్రభాకర్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. అదే విధంగా నామినేటేడ్ పదవి కూడ చంద్రబాబునాయుడు ప్రభాకర్ కు ఇచ్చారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ప్రభాకర్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉండకపోవచ్చని అంటున్నారు. కానీ, గత ఎన్నికల సమయంలో ప్రభాకర్ కర్నూల్ ఎంపీ స్థానం కోసం పట్టుబట్టిన ఆయనకు ఈ స్థానం దక్కలేదు.
undefined
కర్నూల్ జిల్లాలో వైసీపీకి చెక్ పెట్టేందుకు బాబు వ్యూహలు ఏ మేరకు ఫలిస్తాయో వచ్చే ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి. రాయలసీమలో వైసీపీ ప్రాబల్యాన్ని తగ్గించేందుకు ఆయా జిల్లాల్లో బలమైన నేతలకు చంద్రబాబునాయుడు గాలం వేస్తున్నారు.
undefined
click me!