పోతిరెడ్డిపాడుకు కృష్ణా బోర్డు బ్రేక్: జగన్ సర్కార్ ఏం చేయనుంది?

By narsimha lodeFirst Published Jul 31, 2020, 11:59 AM IST
Highlights

పోతిరెడ్డిపాడు ప్రవాహ సామరధ్యం పెంపు( రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్)  ప్రాజెక్టు పనులపై కృష్ణా బోర్డు రాసిన లేఖపై ఏం చేయాలనే దానిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచిస్తోంది.

అమరావతి: పోతిరెడ్డిపాడు ప్రవాహ సామరధ్యం పెంపు( రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్)  ప్రాజెక్టు పనులపై కృష్ణా బోర్డు రాసిన లేఖపై ఏం చేయాలనే దానిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనే దీనిపై సమాధానం ఇస్తోందా.. లేక ఈ సమావేశానికి ముందుగానే బోర్డుకు సమాధానం చెబుతోందా అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.

రాయలసీమ ఎత్తిపోతల పథకం (పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యం పెంపు) ప్రాజెక్టు పై ముందుకు వెళ్లొద్దని కృష్ణా బోర్డు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ఈ నెల 30వ తేదీన ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది కృష్ణా రివర్ బోర్డు. 

ఏపీ పునర్విభజన చట్టం 2014 ప్రకారంగా కొత్త ప్రాజెక్టులు చేపట్టాలంటే కృష్ణా బోర్డుకు సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందేనని ఆయన ఆ లేఖలో కోరారు. ఈ నివేదికను అపెక్స్ కౌన్సిల్ కు పంపాలి. అపెక్స్ కౌన్సిల్ అనుమతులు పొందిన తర్వాతే ప్రాజెక్టు  నిర్మాణాన్ని చేపట్టాల్సి ఉంటుందని హరికేష్ మీనా చెప్పారు. ఏపీ ఇరిగేషన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఆదిత్యనాథ్ దాస్ కు లేఖ పంపారు.


కృష్ణా బోర్డు రాసిన లేఖపై ఏం చేయాలనే దానిపై ఏం చేయాలనే దానిపై ఏపీ ఇరిగేషన్ అధికారులు తీవ్రంగా చర్చిస్తున్నారు.  ఆగష్టు 5వ తేదీన అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసింది కేంద్రం. అయితే ఆగష్టు 20వ తేదీ తర్వాత అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరాలని భావిస్తోంది. 

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన  వాటాలో చుక్క నీటిని కూడ వదులుకోమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పోతిరెడ్డిపాడు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులతో పాటు ఇతర ప్రాజెక్టుల విషయంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తన వాదనలను తెలంగాణ ప్రభుత్వం విన్పించనుంది.

కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డితో పాటు ఇతర ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై ఏపీ ప్రభుత్వం కూడ గతంలోనే ఫిర్యాదులు చేసింది.ఈ ఫిర్యాదులను కూడ మరోసారి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించే అవకాశం ఉంది.

also read:జగన్ ప్రభుత్వానికి కృష్ణాబోర్డు షాక్: పోతిరెడ్డిపాడుకు బ్రేక్

మరో వైపు కృష్ణాబోర్డు ఇచ్చిన ఆదేశాలను కూడ తెలంగాణ ప్రభుత్వం గతంలో ఏ ఏ సమయాల్లో ఉల్లంఘించిందనే అంశాలను కూడ బోర్డు దృష్టికి వచ్చే అవకాశాలను కూడ ఏపీ ఇరిగేషన్ అధికారులు పరిశీలిస్తున్నారు. 

అయితే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనే వీటన్నింటిని ప్రస్తావించాలా... విడిగా కృష్ణా బోర్డుకు లేఖ రాయాలా అనే విషయమై చర్చిస్తున్నారు. ఈ విషయమై  సీఎంతో చర్చించి ఓ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని సమాచారం.

రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఈ ఏడాది మే 5వ తేదీన 203 జీవోను జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. సుమారు రూ. 7 వేల కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

ఈ ప్రాజెక్టు నిర్మాణానికి టెండర్లను ఆహ్వానిస్తూ ఈ నెల  27వ తేదీన ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. జ్యుడిషియల్‌ పర్వ్యూ అనుమతితో టెండర్లకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.ఈపీసీ విధానంలో 3278.18 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 30 నెలల్లో పనులు పూర్తి చేసేలా టెండర్లను ఆహ్వానించినట్లు అధికారులు వెల్లడించారు.

ఆగష్టు 13వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు టెండర్ ధరఖాస్తులను స్వీకరించనున్నారు. 13న టెక్నికల్ బిడ్ తెరిచి, 17న రివర్స్ టెండరింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు.19న టెండర్‌ను ఖరారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో 800 అడుగుల నీటి మట్టం వద్ద రోజుకి 34,722 క్యూసెక్కుల నీరు ఎత్తిపోయడమే లక్ష్యంగా పథకాన్ని రూపకల్పన చేశారు.

click me!