సిబిఐలో అంతర్యుద్ధం: సిఎం రమేష్ పాత్ర ఏమిటి?

By narsimha lodeFirst Published Oct 23, 2018, 9:03 AM IST
Highlights

 సీబీఐ డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్ వ్యవహారంలో టీడీపీ ఎంపీ సీఎం రమేష్ పేరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 

అమరావతి: సీబీఐ డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్ వ్యవహారంలో టీడీపీ ఎంపీ సీఎం రమేష్ పేరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో రమేష్ పేరు ఎందుకు వచ్చిందనేది రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఆసక్తిగా మారింది. సీబీఐ డీఎస్పీ దేవేంద్ర  కుమార్ తప్పుడు వాంగ్మూలంలో సీఎం రమేష్ పేరును నమోదు చేశారని గుర్తించినట్టు కనిపెట్టారు. మొయిన్ ఖురేషీ  కేసులో దేవేంద్ర కుమార్ ను సోమవారం నాడు సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్  రాకేష్ ఆస్థానాల మధ్య ప్రచ్ఛన్నయుధ్దం సాగుతోంది. మాంసం వ్యాపారి  మొయిన్ ఖురేషీ మనీ లాండరింగ్ కేసు నుండి బయటపడేందుకు సీబీఐ ఉన్నతాధికారి ఒకరు రూ.2 కోట్ల ముడుపులు తీసుకొన్నారని ప్రత్యర్థి వర్గం ఆరోపిస్తోంది. ఇరువర్గాలు ఒకరిపై మరోకరు ఆరోపణలు చేసుకొంటున్నారు.

ఈ కేసులో ఏపీకి చెందిన సతీష్ సానా అనే వ్యక్తి సీబీఐ ఉన్నతాధికారి ఒకరికి ముడుపులు ఇచ్చేందుకు ప్రయత్నించారని సీబీఐ డీఎస్పీ దేవేంద్రకుమార్ వాంగ్మూలాన్ని సేకరించారు. టీడీపీ ఎంపీ సీఎం రమేష్ తన మిత్రుడని ఆయన ఈ వాంగ్మూలంలో పేర్కొన్నట్టు సమాచారం. ఈ వాంగ్మూలాన్ని సెప్టెంబర్ 26న సేకరించినట్టుగా రికార్డులు ఉన్నట్టుగా సీబీఐ అధికారులు గుర్తించారు.

అయితే సతీష్ ద్వారా సమాచారం సేకరించినట్టుగా చెబుతున్న సెప్టెంబర్ 26వ తేదీన సతీష్  ఢిల్లీలోనే లేడని ప్రత్యర్థి వర్గం ఆధారాలతో బయటపెట్టింది. దీంతో సీబీఐ డీఎస్పీ దేవేంద్రకుమార్ ప్రత్యర్థి వర్గాన్ని ఇరుకునపెట్టేందుకు తప్పుడు వాంగ్మూలాన్ని తయారు చేశారని ప్రత్యర్థి వర్గం ఆరోపిస్తోంది.

దీంతో తప్పుడు వాంగ్మూలాన్ని రికార్డు చేసిన దేవేంద్రకుమార్ ను న్యూఢిల్లీలో సోమవారం నాడు అరెస్ట్ చేశారు. తప్పుడు సాక్ష్యాలను సృష్టించి ప్రత్యర్థులను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించారని దేవేంద్రకుమార్ పై అభియోగం.

ఇదిలా ఉంటే రెండు వారాల క్రితం టీడీపీ ఎంపీ సీఎం రమేష్ కంపెనీ, బంధువులు, స్నేహితుల ఇళ్లపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.ఈ సోదాల విషయమై సీఎం రమేష్ బీజేపీని లక్ష్యంగా చేసుకొని తీవ్రమైన విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

 

సంబంధిత వార్తలు

సీబీఐలో కుమ్ములాట: రంగంలోకి దిగిన ప్రధాని మోడీ

సీబీఐ చరిత్రలోనే తొలిసారి.. లంచం కేసులో సొంత డైరెక్టర్‌పైనే ఎఫ్ఐఆర్

click me!