సైలెంట్ ఓటింగ్, గెలుపు మాదే: చంద్రబాబు

Published : May 05, 2019, 01:19 PM ISTUpdated : May 05, 2019, 01:42 PM IST
సైలెంట్ ఓటింగ్, గెలుపు మాదే: చంద్రబాబు

సారాంశం

 సైలెంట్ ఓటింగ్ తమ పార్టీకే అనుకూలంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తేల్చి చెప్పారు.  ఎన్నికల్లో ఓటింగ్ తమకు అనుకూలంగా ఉందని భావించిన వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోందని  బాబు ఆరోపించారు.  


అమరావతి: సైలెంట్ ఓటింగ్ తమ పార్టీకే అనుకూలంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తేల్చి చెప్పారు.  ఎన్నికల్లో ఓటింగ్ తమకు అనుకూలంగా ఉందని భావించిన వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోందని  బాబు ఆరోపించారు.

ఆదివారం నాడు ఆయన అమరావతిలో  మీడియాతో మాట్లాడారు. అన్నదాత సుఖీభవ, పసుపు-కుంకుమ, పెన్షన్ స్కీమ్‌లు టీడీపీకి కలిసి వచ్చాయని ఆయన అభిప్రాయపడ్డారు. సర్వేలు, నివేదికలు కూడ తమకు అనుకూలంగా ఉన్నాయని ఆయన చెప్పారు.తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు తమకు కలిసి వచ్చాయని ఆయన తెలిపారు.డబ్బు, కులం చూసి ఓట్లేస్తే రాజకీయ నేతలు ఎందుకు పనిచేయాలని ఆయన ప్రశ్నించారు.

కాళేశ్వరం, మల్లన్నసాగర్ ప్రాజెక్టులపై తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్షలు నిర్వహించిన విషయాన్ని బాబు గుర్తు చేశారు.  కానీ, ఏపీలో మాత్రం తనపై ఈసీ ఆంక్షలు విధించడాన్ని ఆయన తప్పుబట్టారు.  ప్రధానమంత్రి మోడీ చేసిన వ్యాఖ్యలపై బాబు మండిపడ్డారు. 
 

PREV
click me!

Recommended Stories

బస్సులో పరిచయం.. ప్రేమ పేరుతో మోసం రూ.20 లక్షలు బురిడీ | Bus Conductor Accused of Cheating Woman
Employee Holidays : స్టూడెంట్స్ కు 13 రోజులు సరే.. ఉద్యోగులకు దసరా సెలవులు ఎన్నిరోజులో తెలుసా?