ఐఎఎస్‌లపై డీఓపీటీకి ఫిర్యాదు చేస్తాం: ఉద్యోగ సంఘాల వార్నింగ్

By narsimha lode  |  First Published Jan 31, 2022, 7:09 PM IST

చర్చలకు రావాలని ప్రభుత్వం నుండి లిఖిత పూర్వకంగా హమీలు ఇస్తేనే తాము  వస్తామని ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు. పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సభ్యులు సోమవారం నాడు అమరావతిలో మీడియాతో మాట్లాడారు.


అమరావతి: ప్రభుత్వం నుండి లిఖిత పూర్వకంగా చర్చలకు ఆహ్వానం అందితేనే తాము  ఆలోచిస్తామని PRC  సాధన సమితి స్టీరింగ్ కమిటీ స్పష్టం చేసింది.సోమవారం నాడు సుదీర్ఘంగా పీఆర్సీ సాధన సమితి నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత పీఆర్సీ సాధన సమితి నేతలు బండి శ్రీనివాసరావు, సూర్యనారాయణ, బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితరులు  మీడియాతో మాట్లాడారు. 

 ముందుగా పీఆర్సీ స్టీరింగ్ కమిటీ నేత సూర్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 25న తమను చర్చలకు ఆహ్వానిస్తూ వాట్సాప్ ద్వారా ప్రభుత్వం నుండి సమాచారం వచ్చిందన్నారు. అయితే ఈ సమాచారం ఆధారంగా తాము స్టీరింగ్ కమిటీలో చర్చించుకొని employees  సంఘాల ప్రతినిధులను ప్రభుత్వం వద్దకు చర్చలకు పంపితే ఉద్యోగ సంఘాలను అవమానించేలా ప్రభుత్వ కమిటీ తీరుపై ఆయన మండిపడ్డారు. ఆ తర్వాత ఏనాడూ కూడా ప్రభుత్వం నుండి తమకు చర్చల కోసం ఆహ్వానం అందలేదన్నారు.  కానీ ప్రభుత్వం తరపున మంత్రుల కమిటీ మాత్రం చర్చలకు ఆహ్వానించినా ఉద్యోగ సంఘాలు మాత్రం చర్చలకు రావడం లేదంటూ తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని సూర్యనారాయణ చెప్పారు. ఇక నుండి ప్రభుత్వం నుండి లిఖిత పూర్వకంగా చర్చలకు రావాలని ఆహ్వానం అందితేనే చర్చలకు వెళ్తామని ఆయన తేల్చి చెప్పారు.

Latest Videos

undefined

అంతకుముందు పీఆర్సీ స్టీరింగ్ కమిటీ నేత Bandi Srinivasa Rao మీడియాతో మాట్లాడారు.ప్రభుత్వంతో చర్చలకు వెళ్లడానికి మాత్రం గతంలో తాము ప్రభుత్వం ముందుంచిన షరతులకు కట్టుబడి ఉన్నామన్నారు. ఈ షరతులను అమలు చేయడంతో పాటు లిఖిత పూర్వకంగా హామీ ఇస్తేనే తాము చర్చలకు వెళ్తామని ఆయన ప్రకటించారు. ట్రెజరీ ఉద్యోగులపై చర్యలు తీసుకోవద్దని స్టీరింగ్ కమిటీ కోరింది. ట్రెజరీ ఉద్యోగులపై చర్యలు తీసుకోకుంటే సంయమనం పాటిస్తామన్నారు. 

తాము ప్రభుత్వం మాటలు విని మోసపోయామన్నారు. పీఆర్సీపై నియమించిన ఆశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను ఎందుకు బయట పెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్న ఆర్ధిక శాఖలో పనిచేస్తున్న ఐఎఎస్ అధికారులపై కూడా ఢిల్లీకి వెళ్లి డీవోపీటీకి కూడా ఫిర్యాదు చేస్తామని పీఆర్సీ స్టీరింగ్ కమిటీ నేతలు హెచ్చరించారు.

ఫిబ్రవరి 3వ తేదీన ఛలో Vijayawada కార్యక్రమానికి ప్రభుత్వం ఆటంకాలు కల్పిస్తుందని స్టీరింగ్ కమిటీ నేతలు ఆరోపించారు. పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీపై ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడ్డారు.ట్రెజరీ ఉద్యోగులకు తాము అండగా ఉంటామన్నారు. పాత salaries ఇవ్వాలని తాము కోరుతున్నా కూడా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని స్టీరింగ్ కమిటీ ప్రశ్నించింది. కొత్త జీతం వచ్చిన పే స్లిప్ ను  ఫిబ్రవరి రెండో తేదీన ఆయా కార్యాలయాల వద్ద దగ్దం చేయాలని స్టీరింగ్ కమిటీ కోరింది. 
 

click me!