అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా: రాహుల్

By narsimha lodeFirst Published Sep 18, 2018, 3:19 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదాను ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చీఫ్  రాహుల్ గాంధీ ప్రకటించారు. 

కర్నూల్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదాను ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చీఫ్  రాహుల్ గాంధీ ప్రకటించారు. మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ కర్నూల్‌లో  బైరెడ్డి  కన్వెన్షన్ సెంటర్లో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఏపీకి ప్రత్యేక హోదాను ఇవ్వనున్నట్టు  ఆయన మరోసారి హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని మాజీ ప్రధానమంత్రి మన్మోహాన్ సింగ్ ఏపీ ప్రజలకు వాగ్దానం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రత్యేక హోదా అనేది ఏపీ ప్రజల హక్కు అని ఆయన చెప్పారు. 

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏపీకి  అవసరమైన నిధులను, సహాయాన్ని అందించనుందని  రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. అధికారంలోకి వస్తే  ఉద్యోగాలను కల్పిస్తామని ఇచ్చిన హమీని మోడీ నెరవేర్చలేదని  రాహుల్ విమర్శించారు.

ప్రతి రోజూ చైనాలో  50 వేల ఉద్యోగాలను కల్పిస్తోందని చెప్పారు.  దేశంలో ఎన్డీఏ సర్కార్ కేవలం 450 ఉద్యోగాలను కల్పిస్తున్నట్టు చెప్పారు. రాఫెల్ కుంభకోణం గురించి కూడ రాహుల్ గాంధీ  విద్యార్థులకు వివరించారు. బ్యాంకింగ్ వ్యవస్థ కొందరి చేతుల్లోనే చిక్కుకొందన్నారు.   ఎన్నికల ముందు  ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను మోడీ సర్కార్ నెరవేర్చలేకపోయిందన్నారు. 
 

click me!