కల్తీ మద్యంపై తమ ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ఏపీ అసెంబ్లీలో సోమవారం నాడు జంగారెడ్డి గూడెం మరణాలపై ఆయన మాట్లాడారు.
అమరావతి: Jangareddy Gudemలో సహజ మరణాలను కూడా వక్రీకరిస్తున్నారని ఏపీ సీఎం వైఎస్ జగన్ టీడీపీ పై విమర్శలు గుప్పించారు. కల్తీ మద్యంపై తమ ప్రభుత్వం ఉక్కు పాదం మోపినట్టుగా చెప్పారు. ఏపీ అసెంబ్లీలో సోమవారం నాడు ఏపీ సీఎం YS Jagan ప్రసంగించారు. జంగారెడ్డిగూడెంలో Mystery deaths పై ఆయన మాట్లాడారు.
లాభాపేక్షతో గత ప్రభుత్వం liquor విక్రయాలు జరిపిందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 40 వేల మద్యం బెల్ట్ సాపులను ఎత్తివేశామన్నారు. బడి, గుడి సమీపంలో కూడా Chandrababu సర్కార్ యధేచ్ఛగా మద్యం విక్రయాలు నిర్వహించిందని జగన్ విమర్శించారు. ప్రస్తుతం మద్యం అమ్మకాలపై పూర్తి నియంత్రణ విధిస్తున్నామని సీఎం జగన్ ప్రకటించారు.
నాటుసారా, కల్తీ సారా చేసే వారిని ఉక్కుపాదంతో అణచివేయాలని ఆదేశిచ్చిన విషయాన్ని సీఎం జగన్ గుర్తు చేశారు. చంద్రబాబు హయంలో నాటు సారా తయారీ విచ్చల విడిగా సిందన్నారు. చంద్రబాబు హయంలో రాష్ట్రంలో 4,340 మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూమ్ లు కూడా ఉండేవన్నారు. కానీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పర్మిట్ రూమ్ లను రద్దు చేశామని జగన్ వివరించారు.
చంద్రబాబు హయంంలో రాత్రి పూట కూడా మద్యం దొరికేదన్నారు. కానీ తమ ప్రభుత్వంలో నిర్ణీత వేళల్లో మాత్రమే మద్యం అందుబాటులో ఉంటుందని చెప్పారు. మద్యం వినియోగం లేకుండా ఉండేందుకే తమ ప్రభుత్వం మద్యం ధరలను పెంచిందన్నారు. అయితే ఆ తర్వాత ఎస్ఈబీ సహా విపక్షాల నుండి వచ్చిన సూచనలతో మద్యం ధరలను కూడా తగ్గించామని సీఎం జగన్ చెప్పారు.
ఇటీవల కాలంలో జంగారెడ్డిగూడెంలో వరుసగా మరణాలు చోటు చేసుకొన్నాయి. అయితే వరుస మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకొన్న మరణాలకు పలు కారణాలున్నాయని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. మద్యం సేవించడం వల్ల మరణాలు కూడా చోటు చేసుకొన్నాయని కూడా చెబుతున్నారు. అయితే ఇందులో దాదాపు 10 మంది కల్తీ సారా తాగడం వల్లనే చనిపోయారనే ప్రచారం కూడా లేకపోలేదు.
ఈ మరణాలపై దర్యాప్తు నిర్వహించడానికి పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ హైమావతి విజయవాడ జీజీహెచ్ డాక్టర్ల టీమ్ జంగారెడ్డి గూడెనికి చేరుకుంది. మృతుల కుటుంబాల ఇళ్లకు ఈ టీం వెళ్లింది. మృతుల కుటుంబాల నుండి వివరాలు సేకరించింది. ఆయా ప్రాంతాల్లో పర్యటించింది. మృతి చెందిన వారిలో ఇందులో ముగ్గురికి మాత్రం మందు తాగే అలవాటు ఉందని చెప్పారు. ఇందులో పలువురు ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా ఉన్నారని తెలిపారు. మరి కొందరు 60 ఏళ్లకు పైబడిన వారు ఉన్నరని పేర్కొన్నారు. .
ఈ మరణాల నేపథ్యంలో పలువురు అధికారులు సస్పెన్షన్ కు గురయ్యారు. గురువారం ఒకరు హాస్పిట్ లకు వెళ్లిన కొంత సమయానికి మృతి చెందారు. అయితే ఆయన మృతదేహానికి పోస్టు మార్టం చేయలేదు. ఇలా మృతి చెందిన వారెవరికీ పోస్టు మార్టం నిర్వహించలేదు. దీంతో అసలు మరణాలు ఏ కారణంతో సంభవిస్తున్నాయనే అంశంపై ఓ క్లారిటీకి రాలేకపోతున్నారు. అయితే కల్తీ సారా విక్రయిస్తున్నారనే కుటుంబ సభ్యులు తెలిపడంతో అధికారులు పలు చోట్ల దాడులు నిర్వహించారు. దీంతో పాటు పలు చోట్ల హెల్త్ క్యాంప్ లు చేపడుతున్నారు.