గ్యాస్ సిలిండర్‌లో గ్యాస్‌కు బదులు నీళ్లు .. అవాక్కైన వినియోగదారులు, ఎన్టీఆర్ జిల్లాలో ఘరానా మోసం

By Siva KodatiFirst Published Jan 4, 2023, 4:37 PM IST
Highlights

ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం తోర్లపాడులో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. గ్యాస్ సిలిండర్‌లో గ్యాస్‌కు బదులు నీరు బయటపడింది.

సాధారణంగా గ్యాస్ సిలిండర్‌లో ఏముంటుంది. అదేం పిచ్చి ప్రశ్న.. గ్యాసే వుంటుందని మీరు అనుకుంటారు. అయితే ఎన్టీఆర్ జిల్లాలో గ్యాస్‌కు బదులు నీరు రావడంతో అంతా షాకయ్యారు. వివరాల్లోకి వెళితే.. చందర్లపాడు మండలం తోర్లపాడుకు చెందిన నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి మరికొందరు గ్యాస్ సిలిండవర్ కొనుగోలు చేశారు. అనంతరం ఇంట్లో స్టవ్ వెలిగించేందుకు ప్రయత్నించారు. అయితే ఎంతకీ మంట రాలేదు. దీంతో వారికి అనుమానం రావడంతో సిలిండర్‌ను ఊపి చూడగా.. అందులో సగానికి పైగా నీళ్లు వున్నట్లు తేలింది. అంతేకాదు ఖాళీ సిలిండర్ 14 కిలోలకు బదులుగా 17 కిలోల వుంది. దీంతో గ్యాస్ ఏజెన్సీ ఎదుట వారు ధర్నాలు చేశారు. ఇటీవల తెలంగాణలోని మంచిర్యాలలోనూ ఇదే తరహా ఘటన జరగడం కలకలం రేపింది. 

click me!