
అనంతపురం : శనివారం తెల్లవారుజామున అనంతపురం జిల్లాలోని హైదరాబాద్ - బెంగళూరు హైవేపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బియ్యంతో వెళ్తున్న ట్రాక్టర్ ను వేగంగా వస్తున్న వోల్వో బస్సు ఢీ కొట్టింది. దీంతో ట్రాక్టర్ లోని నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా గుత్తి మండలం మామిడూరుకు చెందిన వారిగా గుర్తించారు.