విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ: జేఏసీ ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధనం, అరెస్ట్

By narsimha lodeFirst Published May 3, 2023, 9:34 AM IST
Highlights


విశాఖ స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణను నిరసిస్తూ   జేఏసీ ఆధ్వర్యంలో   రహదారులు దిగ్భంధించారు.  రహదారులను దిగ్భందించిన వారిని  పోలీసులు అరెస్ట్  చేశారు. 

విశాఖపట్టణం: విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణను నిరసిస్తూ  స్టీల్ ప్లాంట్  కార్మిక సంఘాల జేఏసీ  ఇచ్చిన పిలుపు మేరకు  జాతీయ రహదారుల దిగ్భంధనం కొనసాగుతుంది.  విశాఖ పట్టణం జిల్లాలోని పలు చోట్ల  జాతీయ రహదారులను  దిగ్బంధనం చేశారు  ఆందోళనకారులు.. జేఏసీఆందోళనకు వామపక్షాలు మద్దతును ప్రకటించాయి. 

విశాఖ స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణను  జేఏసీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.  ఉమ్మడి  విశాఖపట్టణం జిల్లాలోని 
 గాజువాక, కూర్మన్నపాలెం, ఆగనంపూడి హైవేలపై  రాస్తారోకోలు నిర్వహించారు. మద్దెలపాలెం  ఆర్టీసీ డీపో  ఎదుట   వామపక్ష పార్టీల నేతలు  ఆందోళనకు దిగారు.  ఇవాళ  ఏపీ సీఎం వైఎస్ జగన్ ఉత్తరాంధ్ర లో  పర్యటించనున్నారు.దీంతో  జేఏసీ ఆందోళనతో  పోలీసుు అప్రమత్తమయ్యారు.  ఆందోళనకారులను  అరెస్ట్  చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. 

విశాఖ స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణను  నిరసిస్తూ  దాదాపు  వెయ్యి రోజులకు పైగా  జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు సాగుతున్నాయి.  విశాఖ స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణ విషయంలో వెనక్కు తగ్గేది లేదని కేంద్ర ప్రభుత్వం గత మాసంలో  ప్రకటించింది.  విశాఖ స్టీల్ ప్లాంట్ పూర్తిస్థాయి సామర్ధ్యంతో నడిచేందుకు వీలుగా  స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నిధుల సమీకరణకు  ప్రయత్నాలు  చేస్తుంది. ఈ మేరకు  గత మాసంలో  ఈఓఐ బిడ్ ను ఆహ్వానించింది.  ఈఓఐ బిడ్ లో 27కు పైగా కంపెనీలు పాల్గొన్నాయి. 

click me!