విశాఖలో కిడ్నీ రాకెట్ కలకలం

By Nagaraju penumalaFirst Published May 9, 2019, 12:48 PM IST
Highlights

కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం రూ.12 లక్షలకు ఒప్పందం చేసుకుని తీరా బాధితుడికి రూ.5లక్షలు చేతిలో పెట్టి ముఠా చేతులు దులుపుకోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. తీగ లాగితే డొంక కదిలినట్లు అసలు వ్యవహారం గుట్టు రట్టైంది. ఈ కిడ్నీ రాకెట్ లో కీలక సూత్రధారి బెంగళూరుకు చెందిన దళారీ మంజునాథ్ కీలక పాత్ర పోషించాడు.

విశాఖపట్నం: విశాఖపట్నంలో కిడ్నీ రాకెట్ ముఠా గుట్టు రట్టైంది. హైదరాబాద్ కు చెందిన పార్థసారధి అనే వ్యక్తి నుంచి కిడ్నీ సేకరించి ఓ ముఠా మోసం చేసింది. కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం రూ.12 లక్షలకు ఒప్పందం చేసుకుని తీరా బాధితుడికి రూ.5లక్షలు చేతిలో పెట్టి ముఠా చేతులు దులుపుకోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. 

తీగ లాగితే డొంక కదిలినట్లు అసలు వ్యవహారం గుట్టు రట్టైంది. ఈ కిడ్నీ రాకెట్ లో కీలక సూత్రధారి బెంగళూరుకు చెందిన దళారీ మంజునాథ్ కీలక పాత్ర పోషించాడు. డబ్బులకు ఆశపడిన శ్రద్ధ ఆస్పత్రి వైద్యులు పత్రాలను ఫోర్జరీ చేసి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేసేశారు. 

బెంగళూరుకు చెందిన ప్రభాకర్ కు కిడ్నీ అమర్చారు. కిడ్నీ మార్పిడి అనంతరం బాధితుడికి కేవలం రూ.5లక్షలే ఇవ్వడంతో తాను మోసపోయానని తెలిసిన పార్థసారధి విశాఖపట్నంలో ని మహారాణి పేట పీఎస్ లో ఫిర్యాదు చేశారు. 

ఈ కేసులో నలుగురుపై పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖపట్నంలో కలకలం రేపిన కిడ్నీ రాకెట్ కేసులో ఏ1 నిందితుడుగా మంజునాథ్, ఏ 2గా పేషెంట్ ప్రభాకర్, ఏ3గా శ్రద్ధ హాస్పటల్ డాక్టర్ ప్రభాకర్, ఏ 4గా వెంకటేష్ లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఏ1 ముద్దాయి మంజునాథ్ పోలీసుల అదుపులో ఉన్నాడు. కిడ్నీ రాకెట్ వ్యవహారం కు సంబంధించి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు విశాఖ పోలీసులు. 

click me!