ఆరు హత్యలు : గంటవదిలితే.. కోటిరూపాయలిస్తా.. వాడ్ని కూడా వేసేస్తా... !!

Published : Apr 17, 2021, 09:53 AM ISTUpdated : Apr 17, 2021, 10:00 AM IST
ఆరు హత్యలు : గంటవదిలితే.. కోటిరూపాయలిస్తా.. వాడ్ని కూడా వేసేస్తా... !!

సారాంశం

వరుసగా ఆరుగురిని కసితీరా ఊచకోత కోసిన అప్పలరాజు కేసులో అసలేం జరిగింది.. ఊర్లో మంచివాడిగా పేరున్న అప్పలరాజు లో అంత కసి ఎలా వచ్చింది అనే దానిపై పోలీసులు దృష్టి పెట్టారు. ఇదిలా ఉండగా అంత మందిని తన కత్తికి బలి ఇచ్చిన అతడు ఆ కుటుంబానికి చెందిన మరొకరిని హత్య చేసేందుకు అవకాశం ఇవ్వాలంటూ పోలీస్ స్టేషన్ లోనే ఆవేశానికి గురి అయినట్లు సమాచారం. 

అందుకు అనుమతి ఇస్తే కోటి రూపాయలు ఇస్తానంటూ వింత డిమాండ్ పెట్టాడని తెలిసింది. విజయవాడ నుంచి విజయ్ కిరణ్ అనే వ్యక్తి పెందుర్తి మండలం జుత్తాడ వచ్చారనే ఉద్దేశంతో గురువారం ఉదయం అప్పలరాజు కత్తి తీసుకుని అతడిని చంపడానికి వాళ్ళ ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే.

తన కుమార్తెకు పెళ్లి కాకుండా అడ్డం పడుతున్న విజయ్ కిరణ్ కుటుంబంలో ఎవరిని వదిలిపెట్టకూడదనే ఉద్దేశంతో కనిపించిన వారిని కనిపించినట్టు నరికేశాడని చెబుతున్నారు. అనంతరం పోలీసు స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. అక్కడే ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది.

సాయంత్రం విజయవాడ నుంచి విజయ్ కిరణ్ వచ్చాడని పోలీసులు మాటల ద్వారా విన్న నిందితుడు.. ‘సార్ ఒక గంట వదిలిపెట్టండి.. కోటి రూపాయలు ఇస్తాను.. వాడిని కూడా వేసి వచ్చి మళ్ళీ లొంగిపోతా’ అన్నట్టు సమాచారం. 

కాగా అప్పలరాజు స్థానికంగా వరైనా సాయం కోరి వస్తే ఆదుకుంటాడని చెబుతున్నారు. అయితే తన కుమార్తెను విజయ్ కిరణ్ మభ్యపెట్టి లొంగదీసుకోవడమే కాకుండా, అతని కుటుంబ సభ్యులంతా ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారని అప్పలరాజు అనుమానం. 

దానిపైనే మూడేళ్ల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమార్తెకు పెళ్లి సంబంధాలు వస్తుంటే.. వారే చెడగొడుతున్నారని అనుమానిస్తున్నాడు. పైగా విజయ్ కిరణ్ భార్య పెట్టిన కేసులో కోర్టు చుట్టూ తిరగల్సి వస్తున్నదనే అసహనం కూడా పెరిగిపోయింది. 

విశాఖ ఆరు హత్యలు: పోస్ట్‌మార్టం పూర్తి.. ఆరుగురికి తలకొరివి పెట్టనున్న విజయ్...

తప్పుచేసిన వరు బాగుండగా, ఆడపిల్ల తండ్రిగా తనకు ఆవేదన మిగిలిందనే బాధ అప్పరాజులో ఎక్కువగా ఉండేదని, అందుకే ఆ కుటుంబం మీద అంత కక్ష పెంచుకున్నాడని స్థానికులు చెబుతున్నారు.  

PREV
click me!

Recommended Stories

Nimmala Ramanaidu: ఈ రిజర్వాయర్ల భూ సేకరణలో జగన్ రైతులకు ఏం చేశారో తెలుసా? | Asianet News Telugu
టీడీపీ బతుకంతా కాపీ పేస్టే.. Gudivada Amarnath Comments on Bhogapuram Airport | Asianet News Telugu