భార్యను చంపిన భర్తకు ఉరిశిక్ష: విజయవాడ మహిళా కోర్టు సంచలన తీర్పు

Published : Apr 08, 2021, 12:33 PM IST
భార్యను చంపిన భర్తకు ఉరిశిక్ష: విజయవాడ మహిళా కోర్టు సంచలన తీర్పు

సారాంశం

భార్యను చంపిన భర్తకు విజయవాడ  మహిళా సెషన్స్ కోర్టు మరణశిక్షను విధిస్తూ  గురువారం నాడు సంచలన తీర్పును విధించింది.


విజయవాడ: భార్యను చంపిన భర్తకు విజయవాడ  మహిళా సెషన్స్ కోర్టు మరణశిక్షను విధిస్తూ  గురువారం నాడు సంచలన తీర్పును విధించింది.గర్భవతిగా ఉన్న భార్యపై కిరోసిన్ పోసిన భర్తకు కోర్టు మరణశిక్షను విధించింది.భర్త బత్తుల సంబియార్ సుజిత్ కు ఉరిశిక్షను విధించింది.

2019 జూన్ 15న ఏపీ రాష్ట్రంలోని ఫకీర్‌గూడెంలో ఈ ఘటన చోటు చేసుకొంది.  ఈ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకొని సాక్ష్యాలను సేకరించి కోర్టుకు సమర్పించారు.నిందితుడు  సుజిత్ తన భార్యను చంపినట్టుగా కోర్టుకు ఆధారాలను పోలీసులు సమర్పించడంతో  అతడిని కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో  సుజిత్ కు ఉరిశిక్షను విధిస్తూ కోర్టు ఇవాళ తీర్పు చెప్పింది.

మహిళలను అత్యంత దారుణంగా హత్య చేసిన కేసుల్లో గతంలో కూడ కోర్టులు మరణశిక్షలు విధించాయి. అయితే మరణశిక్షలు విధించడం చాలా అరుదుగా జరుగుతుందని న్యాయ నిపుణుులు అభిప్రాయపడుతున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan with “Tiger of Martial Arts” Title: టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదు| Asianet Telugu
Raghurama krishnam raju: ఘట్టమనేని ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే RRR స్పీచ్| Asianet News Telugu