వైసీపీ ఎమ్మెల్యే పై విజయవాడ ఎంపీ నాని ప్రశంసలు

Published : May 21, 2023, 02:46 PM IST
వైసీపీ  ఎమ్మెల్యే పై  విజయవాడ ఎంపీ  నాని  ప్రశంసలు

సారాంశం

వైసీపీ  ఎమ్మెల్యే  జగన్మోహన్ రావుపై  విజయవాడ  ఎంపీ కేశినేని నాని  ప్రశంసలు  కురిపించారు. 

విజయవాడ:  ఎన్నికల  వరకే  రాజకీయాలకు  పరిమితం కావాల్సిన  అవసరం ఉందని  విజయవాడ ఎంపీ కేశినేని నాని అభిప్రాయపడ్డారు.ఆదివారంనాడు   నందిగామ  ఎమ్మెల్యే  జగన్మోహన్  రావు తో  కలిసి  చందర్లపాడులో  పలు  అభివృద్ది  కార్యక్రమాల్లో  విజయవాడ ఎంపీ  కేశినేని నాని పాల్గొన్నారు.   ఈ సందర్భంగా   ఆయన  మీడియాతో మాట్లాడారు.  అభివృద్ది  పనుల విషయంలో  ఎమ్మెల్యే  జగన్మోహన్ రావు   రాజీపడరన్నారు.  అభివృద్ది  కోసం   పార్టీలకు అతీతంగా  పనిచేయాల్సిన అవసరం ఉందని  ఎంపీ  చెప్పారు.  వైసీపీ, టీడీపీ సిద్దాంతాలు  వేరైనా   అభివృద్ది  కోసం  కలిసి పనిచేస్తామన్నారు.  ఈ ప్రాంతంలో  వైసీపీ, టీడీపీ నేతలు  కలిసి పనిచేయడాన్ని  ఎంపీ కేశినేని నాని  అభినందించారు. అధికార, విపక్ష నేతలు కలిసి  పనిచేస్తే దేశం అభివృద్ది  చెందుతుందన్నారు.   అభివృద్ధి  కోసం పనిచేసిన  నేతలపై  ఎంపీ కేశినేని  ప్రశంసలు కురిపించారు.

 విజయవాడ  ఎంపీ  కేశినేని  నాని   ఏం చేసినా  సంచలనమే. 2019  లో  విజయవాడ నుండి  మరోసారి విజయం సాధించిన  తర్వాత  కేశినేని నాని  ఏదో  కామెంట్  చేస్తూ మీడియాలో  పతాక శీర్షికల్లో  నిలుస్తున్నారు.  స్వంత  పార్టీపై  ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా  విమర్శలు  చేసిన  సందర్భాలు కూడ లేకపోలేదు.  సోదరుడు కేశినేని చిన్నిపై    నాని  పోలీసులకు  ఫిర్యాదు  కూడా  చేసిన విషయం తెలిసిందే.  

 విజయవాడ పార్లమెంట్  నియోజకవర్గంలో  కూడా కేశినేని  చిన్ని  కూడ విస్తృతంగా  పర్యటిస్తున్నారు.   చిన్ని సహా  కొందరికి  పార్టీ టిక్కెట్టు ఇస్తే  వారి  ఓటమి కోసం  పనిచేస్తానని  కూడా  కేశినేని  నాని  ప్రకటించి  సంచలనం సృష్టించారు. ఇవాళ  వైసీపీకి  చెందిన  ఎమ్మెల్యే  జగన్మోహన్ రావుపై  కేశినేని నాని  ప్రశంసలు  కురిపించడం  ప్రాధాన్యత  సంతరించుకుంది.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం పొంచివుందా..? ఈ ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు
Nimmala Ramanaidu: ఈ రిజర్వాయర్ల భూ సేకరణలో జగన్ రైతులకు ఏం చేశారో తెలుసా? | Asianet News Telugu