బెజవాడ రాజకీయాల్లో కీలక మలుపు.. వైసీపీ కీలక నేతతో వంగవీటి రాధ భేటీ 

By Rajesh KarampooriFirst Published Jan 14, 2024, 5:22 AM IST
Highlights

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజా బెజవాడ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరో కీలక వైసీపీ నేత పార్టీ వీడటానికి సిద్దమయ్యారు. ఇంతకీ ఏ పార్టీ లీడర్ అతడు.? ఎందుకు పార్టీని వీడనున్నాడు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో మలుపులు తిరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అసమ్మతి నాయకులు పార్టీలు మారుతున్నారు. తాజాగా, అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ కూడా పార్టీని వీడనున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. సమయం, సందర్భం కోసం వేచి ఉన్నాడని .. కర్టెక్ సమయం చూసి.. పార్టీ ఫిరాయించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.

ఇలా ప్రచారం జరుగుతున్న వేళ.. ఆయనతో శనివారం రాత్రి మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణ భేటీ అయ్యారు. గత పరిచయం ద్రుష్టిలో ఉంచుకుని, టీడీపీ అధినేత భవకుమార్ ను పార్టీలోకి ఆహ్వనించాల్సిందిగా.. రాధాను కోరినట్టు తెలుస్తోంది. దాదాపు గంటకు పైగా సాగిన వీరి భేటీ రాజకీయంగా చర్చనీయంగా మారింది. భవకుమార్ కు వైసీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉండటంతో టీడీపీలోకి అడుగుపెట్టడం ఖాయమనిపిస్తుంది.  

Latest Videos

ఈ నేపథ్యంలో శనివారం ఉదయం భవకుమార్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ వీడొద్దంటూ తనపై తీవ్ర ఒత్తిడి ఉందన్నారు. తాను టీడీపీని సంప్రదిస్తున్నట్లు తెలిపారు. కార్యకర్తలు, శ్రేయోభిలాషులతో మాట్లాడి త్వరలోనే తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని తెలిపారు. అలాగే.. వైసీపీని వీడేందుకు చాలా మంది నాయకులు సిద్ధంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తాను పార్టీ వీడొద్దంటూ దేవినేని అవినాష్, ఇతర వైఎస్సార్సీపీ నేతలు బుజ్జగించే ప్రయత్నం చేశారనీ, కానీ వారి ప్రయత్నాలు ఫలించలేవని అన్నారు. గత ఎన్నికల్లో విజయవాడ తూర్పు అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన భవకుమార్.. 2019 నుంచి వైసీపీ విజయవాడ అధ్యక్షుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే..

click me!