పార్టీ గుర్తు కోసం జయప్రదంగా ఏం చేశారో తెలుసు: బాబుపై వల్లభనేని విసుర్లు

Siva Kodati |  
Published : Sep 20, 2020, 04:51 PM ISTUpdated : Sep 20, 2020, 04:53 PM IST
పార్టీ గుర్తు కోసం జయప్రదంగా ఏం చేశారో తెలుసు: బాబుపై వల్లభనేని విసుర్లు

సారాంశం

టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్. తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ వ్యవస్థాపక అధ్యక్షుడైతే, చంద్రబాబు భూస్థాపిత అధ్యక్షుడని ఆయన సెటైర్లు వేశారు. 

తెలంగాణలో టీడీపీ క్లోజ్ అయినట్లే.. ఏపీలోనూ మూతపడుతుందని వల్లభనేని జోస్యం చెప్పారు. మూతపడే పార్టీలో ఉండాలని ఎమ్మెల్యేలు ఎందుకు అనుకుంటారని వంశీ అన్నారు.

పోలవరం చూపించడానికి చంద్రబాబు రూ.400 కోట్లు ఖర్చు చేశారని...పార్టీ ఎన్నికల గుర్తురావడానికి జయప్రదంగా చంద్రబాబు చేసింది అందరికీ తెలుసునని వల్లభనేని విమర్శించారు.

జగన్ అంగీకరిస్తే చాలా మంది టీడీపీ నుంచి వచ్చేస్తారని వంశీ తెలిపారు. టీడీపీ నుంచి వెళ్లిన వాళ్లు ద్రోహులైతే, వారికి అధ్యక్షుడు చంద్రబాబని ఆయన ధ్వజమెత్తారు. జగన్ తమను పార్టీలోకి చేర్చుకోవడం లేదని.. తమ ఇష్టపూర్వకంగానే సంఘీభావం తెలిపామని వల్లభనేని స్పష్టం చేశారు. 

PREV
click me!

Recommended Stories

10వేల కోట్ల పెట్టుబ‌డులు, 4వేల మందికి ఉద్యోగాలు ఏపీలో భారీ ప్రాజెక్టు| Anantapur Wind Energy Project
జగన్‌కు రాఖీలు కట్టిన వైసీపీ కార్యకర్తలు | YS Jagan Celebrate Rakhi Pournami