అన్నమయ్య జిల్లాలో దారుణం: రమేష్ ను హత్య చేసిన దుండగులు

Published : Dec 27, 2022, 11:55 AM IST
 అన్నమయ్య జిల్లాలో దారుణం: రమేష్ ను హత్య చేసిన దుండగులు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాలోని గుండ్లబురుజులో రమేష్ అనే యువకుడిని గుర్తు తెలియని దుండగులు  హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు. 

వేంపల్లి: అన్నమయ్య జిల్లా నిమ్మనల్లి మండలం  గుండ్లబురుజులో   రమేష్ అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు  సోమవారం నాడు రాత్రి హత్య చేశారు.  రమేష్  తల, మొండెం వేరు చేశారు.   మృతదేహం సమీపంలోనే  హీరో హోండా బైక్ ను పోలీసులు గుర్తించారు. ఈ బైక్ నెంబర్ ఏపీ 39 సీజీ 6862  గా  పోలీసులు ప్రకటించారు. రమేష్ గతంలో  ఓ వ్యక్తి  హత్య కేసులో నిందితుడిగా సమాచారం. ఈ హత్యకు ప్రతీకారంగానే రమేష్ హత్య జరిగిందా  ఇతరత్రా కారణాలతో  హత్య జరిగిందా అనే విషయమై  నిర్ధారణ కావాల్సి ఉందని  పోలీసులు  చెబుతున్నారు. ఈ హత్యకు గల కారణాలపై   దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు ప్రకటించారు. రమేష్  బట్టలు విప్పి, కళ్లలో కారం చల్లి  హత్య చేసినట్టుగా  సంఘటన స్థలాన్ని బట్టి పోలీసులు అనుమానిస్తున్నారు.  నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు ప్రకటించారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!