శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్

Published : Aug 30, 2019, 01:39 PM IST
శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్

సారాంశం

కేంద్ర న్యాయ, సమాచార మరియు ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం కుటుంబసభ్యులతో ఆలయానికి చేరుకున్న మంత్రికి టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు

కేంద్ర న్యాయ, సమాచార మరియు ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం కుటుంబసభ్యులతో ఆలయానికి చేరుకున్న మంత్రికి టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు.

రవిశంకర్ కుటుంబసభ్యులకు శ్రీవారి దర్శనం చేయించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో కేంద్రమంత్రికి వేదపండితులు ఆశీర్వచనం చేసి, స్వామివారి చిత్రపటం అందజేశారు.

రవిశంకర్ ప్రసాద్‌తో పాటు స్టార్ షట్లర్ పీవీ సింధు, ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా శ్రీవారిని దర్శించుకున్నారు. పీవీ సింధు తన తల్లిదండ్రులతో కలిసి ఉదయం అభిషేక సేవలో పాల్గొన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం