కాకినాడ గోపలంక వద్ద గోదావరిలో నలుగురు విద్యార్థుల గల్లంతు: రెండు మృతదేహలు లభ్యం

Published : Oct 22, 2023, 09:33 AM IST
కాకినాడ గోపలంక వద్ద గోదావరిలో నలుగురు విద్యార్థుల గల్లంతు: రెండు మృతదేహలు లభ్యం

సారాంశం

కాకినాడ జిల్లాలోని తాళ్లరేవు మండలం గోపలంక వద్ద గోదావరిలో గల్లంతైన  నలుగురు విద్యార్థుల్లో ఇద్దరి మృతదేహలు ఇవాళ లభ్యమయ్యాయి.

కాకినాడ: జిల్లాలోని తాళ్లరేవు మండలం గోపలంక వద్ద గోదావరి లో గల్లంతైన నలుగురు విద్యార్థుల్లో ఇద్దరి మృతదేహలను  ఆదివారం నాడు లభ్యమయ్యాయి.  ఈ మృతదేహలు   బాలాజీ, గణేష్ లవిగా గుర్తించారు స్థానికులు.

పశ్చిమ గోదావరి జిల్లా సజ్జాపురానికి చెందిన ఏడుగురు యువకులు మూడు బైక్ లపై  శనివారం నాడు గోపలంక పుష్కరఘాట్ వద్దకు వచ్చారు.  స్నేహితుడి పుట్టిన రోజు కావడంతో  వీరంతా  సరదాగా గడిపేందుకు  గోపలంక  పుష్కరఘాట్ కు వచ్చారు.  పుష్కరఘాట్  కార్తీక్ అనే యువకుడు  స్నానానికి దిగాడు. అయితే ప్రమాదవశాత్తు  కార్తీక్  గోదావరిలో మునిగిపోతున్న విషయాన్ని గుర్తించిన ఇతర విద్యార్థులు అతడిని కాపాడే ప్రయత్నం చేశారు.

ఈ ప్రయత్నంలో నలుగురు  గోదావరిలో గల్లంతయ్యారు.  కార్తీక్ ను కాపాడే ప్రయత్నంలో  గణేష్, బాలాజీ, రవితేజలు కూడ గోదావరిలో కొట్టుకుపోయారు.  ఈ విషయాన్ని మిగిలిన విద్యార్థులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు  సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని  గాలింపు చర్యలు చేపట్టారు.  ఇవాళ ఉదయం   బాలాజీ, గణేష్ ల డెడ్ బాడీలు ఇవాళ లభ్యమయ్యాయి.  ఇంకా రవితేజ, కార్తీక్ ల ఆచూకీ ఇంకా  లభ్యం కాలేదు.వీరిద్దరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
 

PREV
click me!

Recommended Stories

Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu
Minister Nara Lokesh: మంత్రి లోకేష్ నే ర్యాగింగ్ చేసిన విద్యార్థి అందరూ షాక్| Asianet Telugu