
గుంటూరు జిల్లాలో కరుడుగట్టిన దోపిడీ దొంగల ముఠా బీభత్సం సృష్టించింది. గుంటూరు పట్టణంలో అర్ధరాత్రి దొంగతనానికి యత్నించిన దొంగల ముఠా అడ్డుగా వున్న ఇద్దరు వాచ్ మెన్ల ను అతి కిరాతకంగా హతమార్చారు. ఈ హత్యలు గుంటూరు ప్రజలను భయాందోళనలు పెంచాయి.
గుంటూరు పట్టణ ఇన్నర్ రింగ్ రోడ్డులోని ఓ బైక్ షోరూం, అరండల్ పేటలోని లిక్కర్ మార్ట్ వద్ద పనిచేసే వాచ్ మెన్లు దొంగల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. షోరూం లోని బైక్స్ దొంగిలించేందుకు యత్నించిన దొంగలముఠా వాచ్ మెన్ బలమైన ఆయుధంతో తలపై కొట్టినట్లున్నారు. దీంతో అతడు రక్తపు మడుగులో పడి ప్రాణాలు కోల్పోయాడు. అయితే బైక్స్ దొంగిలించేందుకు విశ్వప్రయత్నం చేసినా సాధ్యంకాకపోవడంతో దొంగలు అక్కడి నుండి వెళ్లిపోయారు.
ఇక అరండల్ పేటలోని లిక్కర్ మార్ట్ ను దోచుకునేందుకు కూడా దొంగలు ప్రయత్నించారు. అక్కడ కూడా వాచ్ మెన్ ను కిరాతకంగా హతమార్చారు. అనంతరం మార్ట్ లో చొరబడి మద్యం దోచుకెళ్లారు. ఈ రెండు ఘటనలతో గుంటూరులో భయానక పరిస్థితి నెలకొంది.
వీడియో
వాచ్ మెన్ల వరుస హత్యలపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాలను పరిశీలించారు. రెండు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యలు అంతర్రాష్ట్ర దొంగల ముఠా పనే అయివుంటుందని అనుమానిస్తున్నారు. రాత్రుళ్లు ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తూ కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.
ఇలా మద్యం మత్తులో దొంగతనాలకు పాల్పడే దొంగలు మద్యం కోసం దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇలా తెలంగాణలోనూ ఓ మద్యం దుకాణంలో దొంగతనానికి పాల్పడి అడ్డంగా బుక్కయ్యారు ఇద్దరు దొంగలు. సిసి కెమెరాల్లో దొంగతనం రికార్డవడంతో మందు దొంగలను గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసారు.
జగిత్యాల జిల్లా వెల్గటూరులోని మహాలక్ష్మి వైన్ షాప్ లో ఇటీవల దొంగలు పడ్డారు. సెక్యూరిటీ గార్డ్ పై దాడిచేసి వైన్స్ షటర్ ఓపెన్ చేసిన దుండగులు గ్రిల్స్ లోంచి లోపలికి దూరారు. కౌంటర్ లో వున్న కొంత నగదుతో పాటు మద్యం సీసాలను దొంగిలించారు. ఈ దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి.
దొంగల చేతిలో గాయపడ్డ సెక్యూరిటీ గార్డ్ ను జగిత్యాల ప్రభుత్వానికి తరలించి చికిత్స అందించారు. దొంగతనంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సిసి కెమెరాలను పరిశీలించారు. వైన్స్ నిర్వహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి దొంగలను అరెస్ట్ చేసారు.