పంటకాలువలో కారు బోల్తా పడి ఒకరు.. కారు ఢీకొని మరొకరు...

By AN TeluguFirst Published Dec 29, 2020, 9:54 AM IST
Highlights

పాతికేళ్లకే ఆ యువకులకు నూరేళ్లు నిండాయి. రోడ్డు ప్రమాదాలు ఆ ఇద్దరు యువకుల ప్రాణాలు తీసింది. ఆ కుటుంబాలకు ఆధారాన్ని దూరం చేసింది. తూర్పు గోదావరి జిల్లాలో ఓ యువకుడు తన స్నేహితుడితో కలసి శుభకార్యానికి వెళుతుండగా కారు అదుపుతప్పి పంట కాలువలో పడి మృత్యువాత పడితే.. మరో యువకుడు రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని ప్రాణాలు కోల్పోయాడు. జిల్లాలోని సఖినేటిపల్లి మండలం టేకిశెట్టిపాలెం వద్ద, జగ్గంపేట మండలం రామవరం వద్ద జరిగిన ఈ రోడ్డు ప్రమాదాలు రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. 

సఖినేటిపల్లి మండలం టేకిశెట్టిపాలెంలో ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ప్రమాదంలో మలికిపురం మండలం గుడిమెళ్లంక గ్రామానికి చెందిన నక్కా హరీష్‌(25) అనే యువకుడు మృతి చెందాడు. నక్కా హరీష్‌ స్నేహితుడితో కలసి కారులో ఆదివారం రాత్రి సఖినేటిపల్లి మండలం అప్పనరాముని లంక గ్రామంలో జరిగిన ఒక వివాహ రిసెప్షన్‌కు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో టేకిశెట్టిపాలెం వచ్చే సరికి కారు అదుపు తప్పి పి.గన్నవరం ప్రధాన పంట కాలువలో పడింది. ఈ ప్రమాదంలో డ్రైవింగ్‌ చేస్తున్న గుర్రం జాన్‌ వెస్లీ తృటిలో ప్రాణాపాయం నుంచి బయట పట్టాడు. హరీష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. 

జాతీయ రహదారి–16పై జగ్గంపేట శివారు భగత్‌సింగ్‌ నగర్‌ వద్ద కారు ఢీ కొన్న సంఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. జగ్గంపేట ఎస్సై రామకృష్ణ కథనం ప్రకారం.. విశాఖపట్టణం నుంచి విజయవాడ వెళుతున్న కియో కారు జగ్గంపేట శివారు భగత్‌ సింగ్‌ నగర్‌ వద్దకు వచ్చేసరికి మోటారు సైకిల్‌పై రోడ్డు దాటుతున్న రామవరానికి చెందిన ఏడాకుల మధుబాబు(25)ను వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మధుబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. మోటారు సైకిల్‌ నుజ్జునుజ్జుయ్యి, కారు ముందుభాగం కూడా బాగా దెబ్బతింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి జగ్గంపేట ఎస్సై రామకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారు యజమానిపై కేసు నమోదు చేశారు. 
 
click me!