మరణంలోనూ వీడని స్నేహం.. గోదావరిలో మునిగి..

Published : Jul 08, 2021, 03:08 PM IST
మరణంలోనూ వీడని స్నేహం.. గోదావరిలో మునిగి..

సారాంశం

మృతదేహాలను ఆత్రేయపురం ఎస్సై నరేష్‌ పోస్టుమార్టం నిమిత్తం కొత్తపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

గోదావరిలో స్నానానికి వెళ్లి.. ఇద్దరు యువకులు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన రాజమహేంద్రవరంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఆత్రేయపురం మండలం పిచ్చుకలం వద్ద గోదావరిలో స్నానం చేయడానికి నలుగురు యువకులు వెళ్లారు. ఈ క్రమంలో.. నీటి ప్రవాహం ఎక్కువై.. జోసఫ్(15), చిన్న(15) నీట మునిగిపోయారు. దీంతో.. కుటుంబసభ్యులు, పోలీసులు వారి కోసం నీటిలో గాలించగా.. శవాలై తేలారు.

మృతదేహాలను ఆత్రేయపురం ఎస్సై నరేష్‌ పోస్టుమార్టం నిమిత్తం కొత్తపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం ఇరువురి మృతదేహాలు హుకుంపేట చేరుకోవడంతో వారి ఇండ్లతో పాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతులు ఇద్దరూ ప్రాణ స్నేహితులని..ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్లే వారని, చివరికి మరణంలో కూడా వీరి స్నేహబంధం వీడలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇరువురు ఒకే రంగు టీషర్టులు ధరించి ఉండటం చూపరులను కంటతడి పెట్టించింది.

ఇదిలా ఉండగా.. జోసఫ్ తండ్రి గతేడాది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. తల్లి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. కొడుకు చదువుకొని ప్రయోజకుడై.. తనను చూసుకుంటాడని ఆశపడింది. కానీ.. ఇలా అనుకోని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతాడని ఊహించలేదు. దీంతో.. ఆమె కన్నీరు మున్నీరై విలపించింది.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం.. సంక్రాంతి వేళ ఈ ప్రాంతాల్లో అల్లకల్లోలమే
Pawan Kalyan Emotional Speech: కొండగట్టు నాకు పునర్జన్మ ఇచ్చింది | Kondagattu | Asianet News Telugu