కడప జిల్లాలో విషాదం: విద్యుత్ షాక్‌తో ఇద్దరు చిన్నారుల మృతి

Published : Feb 23, 2023, 02:17 PM ISTUpdated : Feb 23, 2023, 02:27 PM IST
    కడప జిల్లాలో విషాదం: విద్యుత్  షాక్‌తో  ఇద్దరు చిన్నారుల మృతి

సారాంశం

కడప జిల్లాలోని  చెన్నూరు మండలం  ఇవాళ విషాదం  నెలకొంది.   విద్యుత్  మెయిన్ లైన్ ను  పట్టుకోవడంతో  ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.  

కడప: జిల్లాలోని చెన్నూరు మండలం  ఖాదర్‌ఖాన్‌కొట్టాలలో  గురువారం నాడు విషాదం  చోటు  చేసుకుంది.    రేకుల షెడ్డుపై ఎక్కి   పొరపాటున విద్యుత్  మెయిన్ లైన్ పట్టుకున్న  ఇద్దరు  చిన్నారులు.   విద్యుత్ షాక్ తో   మృతి చెందారు.  మృతులను   12  ఏళ్ల శశాంక్,  4 ఏళ్ల మనోజ్  గా గుర్తించారు. రేకుల షెడ్ పై  ఎక్కిన  వీరిద్దరూ  పొరపాటున   విద్యుత్  మెయిన్ లైన్లను  పట్టుకున్నారని స్థానికులు  చెబుతున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో  విద్యుత్ షాక్‌తో  మృతి చెందిన ఘటనలు  గతంలో  కూడా  అనేకం  నమోదయ్యాయి. గుంటూరు జిల్లా  కారంపూడి  ఇందిరానగర్ లో  2022 నవంబర్  24వ తేదీన  విద్యుత్ షాక్ తో  తల్లీ, కొడుకు  మృతి చెందారు. బట్టలు ఆరవేస్తున్న సమయంలో తల్లికి విద్యుత్ షాక్ కు గురైంది. ఆమె  కేకలు వేయడంతో  తల్లిని కాపాడేందుకు వెళ్లిన కొడుకు  కూడా  ఈ ఘటనలో  మృతి చెందాడు. 

2022 సెప్టెంబర్  27న   మెట్ పల్లిలో  విద్యుత్ షాక్ తో  ఇద్దరు స్నేహితులు  మృతి చెందారు. స్నేహితుడి దుకాణం వద్ద  బోర్డు రిపేర్  చేస్తున్న  సమయంలో   విద్యుత్ షాక్ కు గురై మరణించారు.  2022 ఆగష్టు  31న  మంచిర్యాల మండలం బొప్పారంలో  విద్యుత్ షాక్ తో  ఇద్దరు  చనిపోయారు. పొలం వద్ద  పనులు చేస్తున్న  సమయంలో  భార్య, కొడుకులు విద్యుత్ షాక్ కి గురయ్యారు.  ఈ ఘటనలో  వారిద్దరూ  అక్కడికక్కడే మృతి చెందారు. 

also read:అనంతపురంలో విషాదం:విద్యుత్ షాక్ తో నలుగురు కూలీలు మృతి

2022 జూలై  12న  కామారెడ్డి లో  ఒకే కుటుంబానికి  చెందిన  నలుగురు మృతి చెందారు.  బట్టలు ఆరేస్తున్న భార్య విద్యుత్ షాక్ కు గురైంది. ఆమెను కాపాడేందుకు  వెళ్లిన భర్త కూడా మృత్యువాత పడ్డారు.  తల్లీదండ్రులు మరణించిన విషయం తెలియని చిన్నారులు వారిని  పట్టుకుని వారు కూడా  మరణించారు. 

PREV
click me!

Recommended Stories

Raghurama krishnam raju: ఘట్టమనేని ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే RRR స్పీచ్| Asianet News Telugu
Ghattamaneni Jayakrishna: విజయవాడలో ఘనంగా కృష్ణవిగ్రహాన్ని ఆవిష్కరించిన మనవడు | Asianet News Telugu