చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్‌.. ట్విస్ట్ ఇచ్చిన కోర్ట్, ఇరు వర్గాల లాయర్లకు పిలుపు

Siva Kodati |  
Published : Sep 11, 2023, 07:41 PM ISTUpdated : Sep 11, 2023, 07:43 PM IST
చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్‌.. ట్విస్ట్ ఇచ్చిన కోర్ట్, ఇరు వర్గాల లాయర్లకు పిలుపు

సారాంశం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హౌస్ కస్టడీ పిటిషన్‌పై విచారణ నేపథ్యంలో కోర్ట్ ట్విస్ట్ ఇచ్చింది. రేపు తీర్పు వెలువరిస్తామన్న న్యాయస్థానం .. ఇరు వర్గాల న్యాయవాదులను మరోసారి పిలిపించింది. 

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయి ప్రస్తుతం రిమాండ్‌లో వున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హౌస్ కస్టడీ పిటిషన్‌పై తీర్పును ఏసీబీ కోర్ట్ రేపటికి వాయిదా వేసింది. అయితే ఇక్కడే న్యాయస్థానం మరో ట్విస్ట్ ఇచ్చింది. ఇరువర్గాల న్యాయవాదులను మరోసారి కోర్ట్‌కు రావాల్సిందిగా ఆదేశించింది. దీంతో న్యాయస్థానం ఏం చెబుతుందా అనే ఉత్కంఠ నెలకొంది. 

అంతకుముందు చంద్రబాబు నాయుడు హౌస్ కస్టడీ పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. చంద్రబాబు హౌస్ కస్టడీకి అనుమతించాలని ఆయన తరఫును సుప్రీం కోర్టు న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపించారు. చంద్రబాబు హోదా, వయసు రీత్యా హౌస్ రిమాండ్ ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా  సుప్రీం కోర్టు తీర్పులను ప్రస్తావించారు. చంద్రబాబు హౌస్ కస్టడీకి అనుమతించాలిన న్యాయమూర్తిని కోరారు. మరోవైపు సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్, అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, స్పెషల్ జీపీ వివేకానంద వాదనలు వినిపించారు. 

ALso Read: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం.. చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్‌పై తీర్పు రేపటికి వాయిదా

చంద్రబాబుకు ఇంట్లో కంటో జైలులో భద్రత ఉంటుందని పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందని పేర్కొన్నారు. జైలులో చంద్రబాబుకు పూర్తి స్థాయి భద్రతను కల్పించినట్టుగా చెప్పారు. జైలు లోపల, బయట పోలీసుల భద్రత ఉందని తెలిపారు. అవసరమైతే వైద్య సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పును చంద్రబాబు కేసుకు ముడిపెట్టవద్దని అన్నారు. చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ డిస్మిస్ చేయాలని  కోరారు. 
 

PREV
click me!

Recommended Stories

రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతోంది ముఖ్యమంత్రి ఎక్కడ: లక్ష్మీ పార్వతి | Lakshmi Parvathi Comments
సచివాలయం ఉద్యోగులు VS పోలీస్ లు విజయవాడ ధర్నా చౌక్ వద్ద హై టెన్షన్ | Secretariat Employees Dharna