ఏపీలో మరో ముగ్గురు మృతి, మొత్తం 41 మరణాలు: కొత్తగా 54 కేసులు

By telugu teamFirst Published May 8, 2020, 12:22 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో ముగ్గురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 41కి చేరుకుంది. కొత్తగా 54 కరోనా కేసులు నమోదయ్యాయి.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ మృత్యు ఘంటికలు కూడా మోగిస్తోంది. తాజాగా గత 24 గంటల్లో మరో ముగ్గురు మరణించారు. విశాఖపట్నం జిల్లాలో ఒకరు, కర్నూలు జిల్లాలో ఇద్దరు కరోనా వైరస్ కారణంగా మరణించారు.  దీంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 41కి చేరుకుంది. 

కాగా గత 24 గంటల్లో కొత్తగా 54 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1887కు చేరుకుంది. గత 24 గంటల్లో 7,320 శాంపిల్స్ ను పరిశీలించగా 54 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇప్పటి వరకు ఆస్పత్రుల నుంచి 842 మంది డిశ్చార్జీ కాగా, 41 మంది మరణించారు. దీంతో ప్రస్తుతం 1004 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

గత 24 గంటల్లో అనూహ్యంగా అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఒక్క రొజులోనే 16 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నం జిల్లాలో 11 కేసులు కొత్తగా నమోదయ్యాయి. గుంటూరు, కర్నూలు, కడప జిల్లాల్లో కాస్తా అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తోంది. గత 24 గంటల్లో కర్నూలు జిల్లాలో 7,  కృష్ణా జిల్లాలో ఆరు, గుంటూరు జిల్లాలో 1 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 3, పశ్చిమ గోదావరి జిల్లాలో 9 కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో మరో కేసు నమోదైంది.

అయినప్పటికీ 547 కేసులతో కర్నూలు జిల్లా అగ్రస్థానంలో కొనసాగుతోంది. గుంటూరు జిల్లా 374 కేసులతో రెండో స్థానంలో ఉంది. కృష్ణా జిల్లాలో 322 కేసులు నమోదయ్యాయి. దాంతో కృష్ణా జిల్లా మూడో స్థానంలో కొనసాగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా తూర్పు గోదావి

జిల్లాలవారీగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఇలా ఉంది...

అనంతపురం 99
చిత్తూరు 85
తూర్పు గోదావరి 46
గుంటూరు 374
కడప 96
కృష్ణా 322
కర్నూలు 547
నెల్లూరు 96
ప్రకాశం 61
శ్రీకాకుళం 5
విశాఖపట్నం 57
విజయనగరం 4
పశ్చిమ గోదావరి 68

 

రాష్ట్రంలో 24 గంటల్లో 7,320 సాంపిల్స్ ని పరీక్షించగా 54 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు.
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 1887 పాజిటివ్ కేసు లకు గాను 842 మంది డిశ్చార్జ్ కాగా, 41 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1004. pic.twitter.com/FKgoPxmDUs

— ArogyaAndhra (@ArogyaAndhra)
click me!