విశాఖలో కిడ్నీ రాకెట్: త్రిసభ్య కమిటీ ఏర్పాటు

Published : May 10, 2019, 01:14 PM IST
విశాఖలో కిడ్నీ రాకెట్: త్రిసభ్య కమిటీ ఏర్పాటు

సారాంశం

విశాఖలో కిడ్నీ రాకెట్‌ ఉదంతంపై జిల్లా కలెక్టర్ ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. తమ విచారణకు ఈ కమిటీ సహకరిస్తోందని ఏపీ డీజీపీ ఠాకూర్ ప్రకటించారు.  

విశాఖపట్టణం: విశాఖలో కిడ్నీ రాకెట్‌ ఉదంతంపై జిల్లా కలెక్టర్ ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. తమ విచారణకు ఈ కమిటీ సహకరిస్తోందని ఏపీ డీజీపీ ఠాకూర్ ప్రకటించారు.

శుక్రవారం నాడు ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. కిడ్నీ రాకెట్ విషయమై మీడియాలో వరుస కథనాలు వచ్చాయి.  దీంతో ఈ విషయాన్ని  ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొంది.ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఈ కేసులో త్రిసభ్య కమిటీ విచారణ చేసి  కలెక్టర్‌కు నివేదికను అందించనుంది. అదే సమయంలో  కిడ్నీ రాకెట్‌లో పోలీసుల విచారణకు అవసరమైన టెక్నికల్ సహాయాన్ని కూడ ఈ కమిటీ అందించనుంది.ఈ కేసులో ఎవరినీ కూడ ఉపేక్షించబోమని కూడ ఏఫీ డీజీపీ ఠాకూర్ ప్రకటించారు.

PREV
click me!

Recommended Stories

YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu
Deputy CM Pawan Kalyan Speech: ఆరడుగుల బుల్లెట్ నేను కాదురఘురామ పై పవన్ పంచ్ లు | Asianet Telugu