వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఆఫీసులో చోరీ

Published : Nov 19, 2019, 08:10 AM IST
వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఆఫీసులో చోరీ

సారాంశం

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కార్యాలయంలో చోరీ జరిగింది. కార్యాలయంలోని రూ.10 లక్షలు చోరీ జరిగినట్లు వైసీపీ నేత జూపూడి జాన్సన్  టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గుంటూరు: గుంటూరు జిల్లా మంగళగిరిలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణా రెడ్డి కార్యాలయంలో చోరీ జరిగింది. కార్యాలయంలోని పది లక్షల రూపాయల చోరీ జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది.

సంక్షేమ కార్యక్రమాల కోసం నగదును ఆఫీసులో ఉంచినట్లు కార్యాలయ వర్గాలు చెప్పినట్లు అర్బన్ సిఐ నరేష్ కుమార్ తెలిపారు. కార్యాలయంలో పనిచేసినవారే అపహరించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు జూపూడి జాన్సన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. 

ఆళ్ల రామకృష్ణా రెడ్డి సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి తనయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

IRCTC Tirupati Kolhapur Tour: ఒక్క టికెట్ తో తిరుమల శ్రీవారి నుంచి కొల్హాపూర్ అమ్మవారి దర్శనం వరకు.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్
Weather Update: బంగాళాఖాతంలో ద్రోణి, ఆవర్తనం.. ఏపీ, తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు