నగరిలో కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికిన ఎమ్మెల్యే రోజా

Siva Kodati |  
Published : Aug 12, 2019, 01:25 PM ISTUpdated : Aug 12, 2019, 03:49 PM IST
నగరిలో కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికిన ఎమ్మెల్యే రోజా

సారాంశం

బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా ఉన్నతాధికారులు, పలువురు వైసీపీ నేతలు తెలంగాణ ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా కేసీఆర్ నగరి చేరుకున్నారు. అక్కడ స్ధానిక ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా ఆయనకు ఘనస్వాగతం పలికారు

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కంచిలోని శ్రీ అత్తివరద రాజస్వామిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం కుటుంబసభ్యలతో కలిసి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకున్నారు.

ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా ఉన్నతాధికారులు, పలువురు వైసీపీ నేతలు తెలంగాణ ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా కేసీఆర్ నగరి చేరుకున్నారు.

అక్కడ స్ధానిక ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా ఆయనకు ఘనస్వాగతం పలికారు. నగరి నుంచి నేరుగా కంచి చేరుకున్న చంద్రశేఖర్ రావు కుటుంబసభ్యులకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.

అత్తివరద రాజస్వామి దేవాయంతో పాటు కామాక్షి దేవాలయంలో సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కంచి నుంచి కేసీఆర్ నేరుగా తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకుని రాత్రికి హైదరాబాద్‌ బయలుదేరుతారు.

 

"

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?