
నెల్లూరు : చిన్నారులకు విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే బుద్దితక్కువ పని చేసాడు. చదువు చెప్పే విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాల్సివాడు కామంతో కళ్లుమూసుకుపోయి నీచంగా ప్రవర్తించాడు. ఇలా విద్యార్థినిపై ఓ కీచక ఉపాధ్యాయుడు లైంగికంగా వేధింపులకు దిగిన ఘటన నెల్లూరు జిల్లాలో వెలుగుచూసింది.
వెంకటగిరి మండలం బంగారుపేట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో లక్ష్మీనారాయణ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అయితే అదే స్కూల్లో చదువకునే బాలికపై కన్నేసిన అతడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో టీచర్ తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని బాలిక తల్లిదండ్రులకు తెలిపింది. గ్రామస్తులతో కలిసి పాఠశాలకు వెళ్లిన బాలిక తల్లిదండ్రులు లక్ష్మీనారాయణను చితకబాదారు.
ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న వెంకటగిరి పోలీసులు పాఠశాలకు చేరుకుని విద్యార్థుల తల్లిదండ్రులను సముదాయించారు. విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయున్ని అదుపులోకి తీసుకున్నారు. అతడిని కఠినంగా శిక్షించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
Read More తల్లీకూతుళ్లపై ఎనిమిది మంది సామూహిక అత్యాచారం.. ప్రయివేటు పార్ట్ లపై కారం చల్లి...
ఇదిలావుంటే మహారాష్ట్రలో ఇలాంటి ఘటనే రివర్స్ లో జరిగింది. ఓ మహిళా ప్రొఫెసర్ పై విద్యార్థి వేధింపులకు పాల్పడ్డాడు. నగ్న వీడియోలను ప్రొఫెసర్ తో పాటు ఆమె భర్తకు పంపించి బ్లాక్ మెయిల్ చేస్తున్న యువకున్ని పోలీసులు అరెస్ట్ చేసార.
బిహార్ కు చెందిన మయాంక్ సింగ్(26) మహారాష్ట్రలోని ఓ యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు. ఇదే యూనివర్సిటీలో పనిచేసే మహిళా ప్రొఫెసర్ తో మయాంక్ కు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఛాటింగ్ చేసుకునేవారు. ఇలా ప్రొఫెసర్ తో బాగా సాన్నిహిత్యం పెరగడంతో మయాంక్ నేరుగా ఫోన్ చేయడం లేదంటే వాట్సాప్ కాల్ చేయడం ప్రారంభించాడు. ఇలా ప్రొఫెసర్ తో చాలాబాగా వుండేవాడు మయాంక్.
అయితే ఓ రోజు ప్రొఫెసర్ కు వీడియో కాల్ చేసిన మయాంక్ నీచమైన కోరిక కోరాడు. నగ్నంగా మారి తనతో మాట్లాడాలని మహిళను బెదిరించాడు. తాను చెప్పినట్లు చేయకుంటే తనతో చేసిన ఛాటింగ్, వీడియో కాల్స్ రికార్డింగ్ బయటపెట్టి యూనివర్సిటీలో తప్పుడు ప్రచారం చేస్తానని భయపెట్టాడు. దీంతో మహిళా ప్రొఫెసర్ భయపడిపోయి అతడు చెప్పినట్లు నగ్నంగా వీడియో కాల్ మాట్లాడింది. ఆ వీడియోను సేవ్ చేసుకున్న మయాంక్ బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు.
ప్రొఫెసర్ తో పాటు ఆమె భర్తకు ఈ వీడియో పంపి రూ.4 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసాడు మయాంక్. దీంతో బార్యాభర్తలిద్దరు స్థానిక పోలీసులకు ఫిర్యాదుచేసారు. వెంటనే మయాంక్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మొబైల్ ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.