Amaravati: మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్సీపీ నేతృత్వంలోని ప్రభుత్వమేనని ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. 2019 ఎన్నికల కంటే ఈసారి పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు కేసులను గురించి ప్రస్తావిస్తూ.. చంద్రబాబు బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు స్వయంగా తిరస్కరించిందనీ, కానీ సిగ్గులేకుండా ఆ పార్టీ నిరసనలు చేస్తోందని విమర్శించారు.
YSRCP senior leader V Vijayasai Reddy: మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్సీపీ నేతృత్వంలోని ప్రభుత్వమేనని ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. 2019 ఎన్నికల కంటే ఈసారి పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు కేసులను గురించి ప్రస్తావిస్తూ.. చంద్రబాబు బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు స్వయంగా తిరస్కరించిందనీ, కానీ సిగ్గులేకుండా ఆ పార్టీ నిరసనలు చేస్తోందని విమర్శించారు.
వివరాల్లోకెళ్తే.. తిరుపతి జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకునేలా పార్టీ కార్యకర్తలు సన్నద్ధం కావాలని వైఎస్ఆర్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, తిరుపతి జిల్లా అధ్యక్షుడు ఎన్ .రామ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. రెండు రోజుల జిల్లా సమావేశం చివరి రోజున పార్టీ కార్యకర్తలనుద్దేశించి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ 2019 ఎన్నికల కంటే ఈసారి పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో మెరుగైన పాలన అందిస్తున్నామని తెలిపారు. ప్రజలు మరోసారి తమకు మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
undefined
ఇదే సమయంలో తెలుగు దేశం పార్టీ, నాయకులను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు స్వయంగా తిరస్కరించిందన్నారు. అయినప్పటికీ సిగ్గులేకుండా నిరసనల కార్యక్రమాలు నిర్వహిస్తోందని దుయ్యబట్టరు. స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో చంద్రబాబు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారన్నారు. కానీ చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నాయకులు తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు డ్రామాలు ఆడుతున్నారనీ, రాష్ట్రంలో మోత మోగిద్దాం శబ్దాలు చేసే బదులు రాష్ట్రపతి భవన్, పీఎం కార్యాలయం, ఈడీ కార్యాలయం ముందు మాట్లాడాలని ఆయన అన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు డీ.పురంధరేశ్వరి, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, జయప్రకాశ్ నారాయణ సహా చంద్రబాబు అవినీతిని సమర్థిస్తున్న వారు ఢిల్లీలో ఎందుకు గళం విప్పలేకపోతున్నారు? అని ప్రశ్నించారు. కొన్ని నెలల క్రితం చంద్రబాబుకు ఐటి శాఖ నోటీసు ఇచ్చిన విషయాన్ని ఉటంకిస్తూ చంద్రబాబు అవినీతికి పాల్పడటం కొత్తేమీ కాదని ఆయన అన్నారు.